పవన్ అత్తతో… ఫోటోషూట్…!

Nadhiya Stunning Photoshoot - JFW Coverతెలుగు చిత్ర సీమలో సినీ అవకాశాలు రావడానికి కారణమైన సినిమా ‘మిర్చి’ అయినప్పటికీ, పవన్ తో నటించిన “అత్తారింటికి దారేది” సినిమాతో ప్రేక్షకులకు చేరువైన నదియా, ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లలో డిమాండ్ ఉన్న నటీమణి. అయితే వచ్చిన అవకాశాలన్నింటికి సైన్ చేయకుండా, కేవలం సెలక్టివ్ సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకునే నదియా, తాజాగా ఓ ఫోటోషూట్ కు ఫోజులిచ్చారు.

ఈ వయసులో ఫోటోషూట్ ఏంటి? అన్న ఆశ్చర్యం అవసరం లేదు. ‘అతిలోకసుందరి’ శ్రీదేవి ఇచ్చినంత ‘యు/ఎ’ సర్టిఫికేట్ ఫోటోషూట్ కాదు గానీ, తన స్థాయికి తగ్గ రీతిలో ‘క్లీన్ యు’ ఫోటోషూట్ చేసింది నదియా. జే.ఎఫ్.డబ్ల్యూ మ్యాగ్ జైన్ కు ఇచ్చిన ఈ ఫోటోషూట్ వీడియో ప్రస్తుతం వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వయసు పెరిగిందే గానీ, నదియా అందంలో మార్పు లేదనే విధంగా ఈ ఫోటోషూట్ నిలుస్తోంది.

ADVERTISEMENT

ఏంతైనా పవన్ అత్త గారు కదా… సంస్కారంలో సాటి ఉండదులే..!

ADVERTISEMENT
Latest Stories