బాలయ్యపై నాగబాబు కామెంట్స్ రోజురోజుకీ శృతిమించి పోతున్నాయి. నిన్నటివరకూ వరుసగా బాలయ్య మాటలకు కౌంటర్లు ఇచ్చిన నాగబాబు, బాలయ్యని టార్గెట్ చేస్తూ ఒక షార్ట్ ఫిలిం కూడా తీసి తన యూట్యూబ్ ఛానెల్ లో పబ్లిష్ చేసేసాడు. ఇక మెగా ఫాన్స్ దాన్ని వైరల్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే అసలు నాగ బాబు తన స్థాయి మరచి ప్రవర్తిస్తున్నాడు అనేది మిగిలిన వారి వాదన. ఎందుకంటే “ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి..లేక కడుపైనా చెయ్యాలి” అన్న వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుంటూ నాగబాబు షార్ట్ ఫిలిం చేసాడు. అయితే దీనిపై నాగబాబు కావాలనే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాడో అర్ధం కావడంలేదు అంటున్నాయి ఇతర వర్గాలు…ఇదే విషయంపై బాలయ్య అసెంబ్లీ సాక్షిగా క్షమాపణలు కూడా చెప్పాడు.
అసలు నాగబాబు ఏం టార్గెట్ పెట్టుకుని అలా మాట్లాడుతున్నాడో? ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చెయ్యడం వల్ల ఆయనకు చేకూరే లబ్ది ఏంటో తెలీదు కానీ, మొత్తంగా అయితే, ప్రశాంతంగా ఉన్న అభిమానులని రెచ్చగొడుతున్నాడు నాగబాబు. మరి ఏమాత్రం తేడా వచ్చినా సమిధులు అయ్యేది అభిమానులే కదా.



