నాగబాబు సీరియస్ గా చెప్తుంటే నవ్వుతారేంటి?

Naga-Babu---Pawan-Kalyan“2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో గెలవబోయేది తన సోదరుడు స్థాపించిన జనసేన పార్టీయేనని, ఢిల్లీలోని క్రేజీవాల్ మాదిరి తిరుగులేని మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవడం తధ్యం” అంటూ మెగా బ్రదర్ నాగబాబు ఎంతో సీరియస్ గా జనసేన గురించి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు పట్ల నెటిజన్లకు మాత్రం నవ్వును పంచుతుండడం కొసమెరుపు.

ఏపీ సిఎం ఏమో గానీ, ట్విట్టర్ సిఎంగా పవన్ ఎన్నిక అవుతారని… ఒకరంటుంటే, మరికొందరు ఏకంగా క్యాబినెట్ లో ఉండబోయే మంత్రులు పేర్లు అంటూ హైపర్ ఆది, షకలక శంకర్, సప్తగిరి, సుడిగాలి సుధీర్ వంటి కమెడియన్ పేర్లు రాస్తూ మరింత ఫన్నీగా మార్చేస్తున్నారు. ఇలా ఒకటేమిటి నెటిజన్లకు పరిపూర్ణమైన సంతోషాన్ని పంచే విధంగా నాగబాబు వ్యాఖ్యలు నిలవడం విశేషం.

ADVERTISEMENT

[m9adh]

ADVERTISEMENT
Latest Stories