ఒరేయ్ తప్పురా … నాగబాబు ఏం చేశాడు ?

Naga Babu Konidelaనిన్న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఇండియా టీం ఘోరంగా ఓడిపోయింది. ఇండియా గెలుస్తుందని నిన్న చాలా బెట్టింగ్స్ వేసుకున్నారు. కానీ ఫైనల్ గా ఎవరూ ఊహించని విధంగా ఇండియా టీం అపజయం అందరికీ షాక్ ఇచ్చింది.

అయితే ఈ ఓటమి వెనుక నాగబాబు ఐరన్ లెగ్ ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. అదేంటి నటుడు , నిర్మాత నాగబాబు కి ఇండియా మ్యాచ్ ఓటమికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా ? ఇటివలే నాగబాబు మా ఎలక్షన్స్ లో కీలక పాత్ర పోషించి ప్రకాష్ రాజ్ ప్యానల్ ని సపోర్ట్ చేశాడు.

ADVERTISEMENT

ప్రకాష్ రాజ్ ఓడిపోవడం మంచు విష్ణు అధిక మెజారిటీతో గెలవడంతో అందరూ ప్రకాష్ రాజ్ ఓటమికి నాగబాబు చేసిన అతి వ్యాఖ్యాలు కూడా కారణం అంటూ చెప్పుకున్నారు. ఇక నిన్న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ గా చూసేందుకు తనయుడు వరుణ్ తేజ్ తో కలిసి దుబాయ్ వెళ్ళాడు నాగబాబు.

స్టేడియం లో నాగబాబు , వరుణ్ మ్యాచ్ వీక్షిస్తున్న ఫొటోస్ బయటికి వచ్చాయి. దీంతో నెటిజన్లు నాగబాబు ఐరన్ లెగ్ వల్లే ఇలా జరిగిందని తను ఎవరిని సపోర్ట్ చేస్తే వాళ్ళు ఓడిపోవడం ఖాయం అంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగబాబుకి ఎంత నెగిటివిటీ ఉందో ఈ విషయం చూస్తే అర్థమవుతోంది.

https://twitter.com/rahul_tarakianG/status/1452510044113694724?s=20

https://twitter.com/Udayvarma1882/status/1452332794412163079?s=20

 

ADVERTISEMENT
Latest Stories