అక్కినేని ఫ్యామిలీ అంతా అటువైపే!

Naga Chaitanya Signs A Web Series for Amazon Prime Videoఅక్కినేని నాగ చైతన్యకు చెందిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అతని లవ్ స్టోరీ విడుదలకు సిద్ధంగా ఉంది. పోయిన నెల విడుదల కావాల్సిన ఆ చిత్రం కరోనా కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడింది. అతని మరో సినిమా థాంక్ యు దాదాపుగా పూర్తయింది. ఇప్పుడు, అతను తన తొలి డిజిటల్ ప్రాజెక్టుకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్, అమెజాన్ ప్రైమ్ వీడియోతో అగ్రిమెంట్ చేసుకున్నాడట

ఇది ఓక యాక్షన్ థ్రిల్లర్ అని సమాచారం. దీనికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది జూలైలో షూట్ ప్రారంభమవుతుంది. ఈ వెబ్ సిరీస్‌కు ఇప్పటికే పాన్ – ఇండియా లెవెల్ లో ఫేమ్ ఉన్న అతుల్ కులకర్ణి, రాధికా ఆప్టే మరియు ఇతరులను సైన్ చేసిందట అమెజాన్. ఈ వెబ్ సిరీస్ ను వచ్చే ఏడాది సమ్మర్‌కు విడుదల చేయాలనేది ప్రణాళిక.

ADVERTISEMENT

నాగ చైతన్యసతీమణి సమంత ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క ది ఫ్యామిలీ మ్యాన్ 2 తో డిజిటల్ అరంగేట్రం చేస్తోంది. ఈ వేసవిలో విడుదల కానున్న వెబ్ సిరీస్‌లో ఆమె ఉగ్రవాదిగా నటించింది. ఆ వెబ్ సిరీస్ ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడంతో… ఓటీటీ స్పేస్ లో ది ఫ్యామిలీ మ్యాన్ 2 పై ఎంతో ఆసక్తిగా ఉంది. అయితే దాని విడుదలను అమెజాన్ ఇంకా ప్రకటించలేదు.

ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే చిత్ర సీమలో యాక్షన్ ఇమేజ్ తెచ్చుకోవడానికి నాగచైతన్య చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. అటువంటి జోనర్ నే తన డిజిటల్ అరంగేట్రానికి సెలెక్ట్ చేసుకోవడం గమనార్హం. నాగార్జున కూడా త్వరలో ఒక వెబ్ సిరీస్ చెయ్యబోతున్నట్టు మొన్నా మధ్య ప్రకటించారు. మొత్తం ఫ్యామిలీ అంతా డిజిటల్ వైపే చూస్తున్నట్టుగా ఉంది.

ADVERTISEMENT
Latest Stories