డేంజరస్ టైటిల్ తో రాబోతున్న యువహీరో!

Naga-Shourya-Chalo-Controversyసినిమా వాళ్ళకు ఉన్న సెంటిమెంట్స్ తెలియనివి కావు. అలాంటి సెంటిమెంట్స్ లో ఒకటి ‘నర్తనశాల.’ ఈ టైటిల్ చెప్పగానే నందమూరి తారకరామారావు నటించిన ‘నర్తనశాల’ గుర్తుకు వస్తుంది. అయితే ఇదే సినిమాను రీమేక్ చేద్దామని బాలకృష్ణ సంకల్పించడం, ఈ సినిమా కొంతకాలం పాటు షూటింగ్ జరుపుకోవడం, అందులో ఎంపిక చేసిన నటీనటులలో ఎక్కువ మంది అకాల మరణం చెందడం అనేది తెలియనిది కాదు. దీంతో టాలీవుడ్ లో ‘నర్తనశాల’ అనేది డేంజరస్ టైటిల్ గా పిలవబడుతుంది.

అయితే ఇదే టైటిల్ తో తాజాగా నాగశౌర్య తన తాజా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా టైటిల్ ‘నర్తనశాల’ అని ముందే చెప్పినప్పటికీ, ఆ తర్వాత మారొచ్చన్న సంకేతాలు వినిపించాయి. కానీ అదే టైటిల్ తో నాగశౌర్య రాబోతున్నాడని తాజాగా ఖరారయ్యింది. ‘ఛలో’ సినిమా మాదిరే ఈ ‘నర్తనశాల’ కూడా నాగశౌర్య సొంత బ్యానర్ లోనే రూపుద్దిదుకుంది. అన్ని హంగులు పూర్తి చేసుకుని ఈ ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories