నాగార్జున… సైలెంట్ కిల్లర్…!

Nagarjuna indirect punch to nandi awardsఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన మూడు సంవత్సరాల నంది అవార్డులపై ‘మెగా’ కాంపౌండ్ వేదికగా బండ్ల గణేష్, నల్లమలపు బుజ్జి తదితరులు చేసిన రచ్చ తెలియనిది కాదు. ‘మనం’ సినిమాను అడ్డుపెట్టుకుని తమ సినిమాలకు అవార్డులు రాలేదంటూ మీడియాలకెక్కి అబాసుపాలు కాగా, అసలు ‘మనం’ సినిమాను తీసిన అక్కినేని కాంపౌండ్ మాత్రం నోరు మెదపలేదు.

ADVERTISEMENT

అయితే నాగ్ లో ఎంత అసంతృప్తి దాగి ఉందనే విషయం మాత్రం “హలో” ట్రైలర్ వేదికగా వ్యక్తపరిచారు. మరో విధంగా చెప్పాలంటే అందరికీ కలిపి అదిరిపోయే పంచ్ వేసారు. డిసెంబర్ 22వ తేదీన విడుదల కానున్న “హలో” ట్రైలర్ మొదటి షాట్ లోనే నంది అవార్డులపై పంచ్ పండింది. ‘ఫ్రం ది మేకర్స్ ఆఫ్ మనం’ అంటూ వేసిన షాట్ తర్వాత ‘మీ హృదయాలతో ఇచ్చిన అవార్డులు’ అంటూ తన ఉద్దేశాన్ని ఒక్క ముక్కలో చెప్పేసారు.

దీంతో ‘హలో’ ట్రైలర్ విడుదలతో పాటు, తన వైరీ వర్గానికి సూపర్ పంచ్ ఇచ్చారు నాగ్. మెగా కాంపౌండ్ మాదిరి రచ్చ రచ్చ కాకుండా, సైలెంట్ గా తన పని కానిచ్చేసిన నాగ్ తీరు చూసి ముక్కున వేలేసుకోవడం సినీ జనాల వంతవుతోంది. అంతేకదా… టైం అనేది అందరిది కదా… ఎవరికి అవకాశం చిక్కితే వాళ్ళు వేసేయాల్సిందే మరి… ఆ టైం కోసం వేచిచూడడమే నాగ్ లాంటి పరిపక్వత గల వాళ్ళు చేసే పని..!

ADVERTISEMENT
Latest Stories