జనరల్ నాలెడ్జ్ – విరాట్ కోహ్లి గర్ల్ ఫ్రెండ్ ఎవరు?

anushka-affairతొమ్మిదో తరగతికి సంబంధించిన పర్సనల్ ట్రైనింగ్ (పీటీ) పరీక్షా పేపర్ లో ఒక వివాదాస్పద ప్రశ్న అడిగిన సంఘటన మహారాష్ట్రలోని భీవండి సిటీలో ఉన్న ఒక హిందీ హైస్కూల్ లో చోటుచేసుకుంది. పీటీ పరీక్షా పేపర్ లో క్రికెటర్ విరాట్ కోహ్లీ గర్ల్ ఫ్రెండ్ ఎవరంటూ ఒక ప్రశ్న దర్శనమివ్వడంతో విద్యార్థులు ఆశ్చర్యపోయారు. భీవండిలోని చాచా నెహ్రూ హిందీ హైస్కూల్ లో నిర్వహించిన ఈ రాత పరీక్షలో గత గురువారం నాడు ఈ ప్రశ్న అడిగారు.

సదరు ప్రశ్నకు సరైన సమాధానం టిక్ చేయమంటూ.. నటీమణులు ప్రియాంక, అనుష్క, దీపిక అనే మూడింటిని ఆ పరీక్ష పత్రంలో పేర్కొనడం గమనార్హం. ఈ ప్రశ్నాపత్రం సామాజిక మాధ్యమాలకు చేరడంతో వైరల్ గా మారింది. కాగా, ఈ సంఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ ఏఆర్ పాండే స్పందిస్తూ, సదరు ప్రశ్నాపత్రంలో ఈ ప్రశ్న రావడానికి కారణం పీటీ టీచరేనని మండిపడ్డారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories