సినీ హీరోగా, ఎమ్మెల్యేగా రెండు బాధ్యతలను సక్రమమంగా నిర్వహిస్తూ ప్రజల మన్నననలు పొందుతున్న నందమూరి నటసింహం బాలకృష్ణ, తన నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఇటీవల హిందూపురం వచ్చారు. మంగళవారం నాడు రైతు సదస్సులో పాలుపంచుకున్న బాలకృష్ణ, అక్కడ నుండి తన వాహనంలో రోడ్డు మార్గం గుండా బెంగుళూరు పయనమయ్యారు.
అయితే రైతు సదస్సులో పాల్గొన్న బాలకృష్ణ వాహనానికి అభిమానులు దండలు వేయగా, సదరు దండ గాలికి ఎగిరి అద్దంపై పడడంతో, మార్గం కనిపించక బాలకృష్ణ ప్రయాణిస్తున్న వాహనం డివైడర్ ను డీ కొట్టింది. వేగంగా ప్రయాణిస్తుండడంతో కారుకు డ్యామేజ్ కాగా, కారులో ఉన్న బాలకృష్ణతో సహా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడం ఊపిరి పీల్చుకునే విషయం.
ప్రమాదం జరిగిన వాహనాన్ని వదిలి, అక్కడ నుండి బాలకృష్ణ మరో వాహనంలో బయలుదేరారు. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని, బాలయ్య బాబు సురక్షితంగా ఉన్నారని మీడియా ఛానల్స్ ప్రధాన సమాచారాన్ని అందించారు. అయితే ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? బెంగుళూరు వెళ్తుండగా సంభవించిందా? హైదరాబాద్ తిరిగి వస్తుండగా చోటు చేసుకుందా? అన్న పూర్తి సమాచారం రావాల్సి ఉంది.



