ఇదివరకంటే గాసిప్పులు లేదా కాంట్రవర్సీలకి ఎక్కువ లైఫ్ ఉండేది కాదు. మహా ఐతే ఏవైనా వారపత్రికలు లేదా మంత్లీ మ్యాగజైన్లు మాత్రమే వాటిని క్యారీ చేసేవి. అందువల్ల ఎంత ఎంత పెద్ద ఇష్యూ అయినా కొన్నాళ్ళకి చల్లబడిపోయేది. అయితే.. ఎప్పుడైతే యూట్యూబ్ మొదలైందో అప్పటినుండి ఆల్మోస్ట్ అన్నీ ఇష్యూస్ వీడియో రూపంలో లేదా ఆడియో రూపంలో నెట్లోకి ఎంటర్ అవ్వడం మొదలయ్యాయి. ఇక ట్విట్టర్ వచ్చాక డిజిటల్ ఫుట్ ప్రింట్ అనేది చాలా డేంజరస్ అయిపోయింది. ఇండస్ట్రీకి చెందినవాళ్లు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఒక్కసారి నోరు జారారు అంటే.. జీవితాంతం దాని తాలుకు పర్యవసానాలు అనుభవిస్తూనే ఉండాలి. అందుకు తాజా నిదర్శనం వెంకటేష్ మహా.
వెంకటేష్ మహా ఓ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ లో పాల్గొని కే.జి.ఎఫ్ సినిమాపై చేసిన కామెంట్ ఎంతటి రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. తాను మాట్లాడింది కేవలం పాత్రను ఉద్దేశించి మాత్రమే కానీ.. డైరెక్టర్నో, హీరోనో లేక సినిమానో కాదని వెంకటేష్ మహా ఒకటికి పదిసార్లు చెప్పాడు. అన్నిటికీ మించి ఆ వీడియో అసలు రిలీజ్ చేయొద్దని సదరు యూట్యూబ్ ఛానల్ ఓనర్ కమ్ హోస్ట్ ను రిక్వెస్ట్ కూడా చేశానని.. అయినా ఆమె వ్యూస్ కోసం ఆ వీడియోను ఎడిట్ చేయకుండా రిలీజ్ చేసిందని వెంకటేష్ మహా రీసెంట్ గా కూడా తన అసంతృప్తిని వెల్లడించాడు.
అయితే.. ఇప్పుడు అదే కే.జి.ఎఫ్ ఇష్యూ వెంకటేష్ మహా తాజా చిత్రం “రావు బహదూర్” విషయంలోనూ నెగిటివిటికీ క్రియేట్ చేస్తుంది. మరీ మేకర్స్ చెప్పినట్లుగా మునుపెన్నడూ చూడని విధంగా తెలుగు సినిమాని పరిచయం చేయనప్పటికీ.. ఒక మంచి సినిమా తీశాడు అనే అందరూ మెచ్చుకున్నారు. కానీ.. ఈ సినిమాకి మాస్ ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వడం లేదు.. పైగా ఇది కేవలం ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కోసం మాత్రమేనని స్టాంప్ వేసేస్తున్నారు. ఆ స్టాంపింగ్ వల్ల సినిమా కలెక్షన్స్ కాస్త ఎఫెక్ట్ అవుతున్నాయి.
మరి ఈ సమస్యకి డ్యామేజ్ కంట్రోల్ ఏమిటి? వెంకటేష్ మహాను ఒక డైరెక్టర్ గా మాస్ ఆడియన్స్ ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ & కే.జి.ఎఫ్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయాలంటే వెంకటేష్ మహా ఏం చేయాలి? అనేది అతను, అతడి బృందం అర్జెంటుగా ఆలోచించాల్సిన విషయం.




