మోక్షజ్ఞ కొత్త ఫోటో… మాకీ టార్చర్ ఏంట్రా బాబు అంటున్న ఫ్యాన్స్

Nandamuri Mokshagna Looks Totally Disinterestedనందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి ఎప్పటినుండో ఆసక్తి ఉంది. నందమూరి అభిమానులు దాని కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నారు. అయితే ఇదిగో అదిగో అంటూ అది వాయిదా పడుతూ వస్తుంది. అది అలా ఉంచితే అప్పుడప్పుడు మోక్షజ్ఞ ఫోటోలు బయటకు వచ్చి ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతున్నాయి. మోక్షజ్ఞ పర్సనాలిటీ చూస్తే అసలు హీరో మెటీరియల్ లా లేడు దానితో వేరే హీరో అభిమానులు నందమూరి ఫ్యాన్స్ ను రాగ్గింగ్ చేస్తున్నారు.

ADVERTISEMENT

గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది ఇదే. తాజాగా ఇంకో ఫోటో సోషల్ మీడియా వైరల్ అవుతుంది. మోక్షజ్ఞతో కలిసి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పుల్లేటికుర్ర గ్రామానికి వచ్చిన బాలకృష్ణ… శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ సిద్ధాంతి కారుపర్తి నాగమల్లేశ్వర అధ్వర్యంలో స్వామి వారికి చండీ హోమం, సుదర్శన హోమం, రుద్రాభిషేకంలో బాలకృష్ణ, మోక్షజ్ఞలు పాల్గొన్నారు. అయితే ఈ పర్యటన మొత్తం గోప్యంగా సాగింది.

అయితే మోక్షజ్ఞ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. మోక్షజ్ఞ ఓవర్ వెయిట్ గా ఉండడంతో మరోసారి నందమూరి అభిమానులకు రాగ్గింగ్ మొదలయ్యింది. అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం అసలు సినిమాలలోకి రావాలని నిర్ణయించుకుంటే సెలబ్రిటీలకు తగ్గడం ఎంతసేపు అని అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉండగా కొందరు మోక్షజ్ఞ త్వరలోనే టాలీవుడ్ కు పరిచయం అవుతున్న నేపథ్యంలోనే ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories