nandamuri-mokshagna-nandamuri-ntr

నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ చాలా కాలం క్రితమే సినీ పరిశ్రమలో ప్రవేశించాల్సి ఉండగా ఎట్టకేలకు ప్రశాంత్ వర్మ ద్వారా లాంచింగ్ అవుతున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీతో బాలయ్య అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. స్వర్గీయ నందమూరి హరికృష్ణ కుమారుడు స్వర్గీయ జానకీరామ్. ఆయన కుమారుడు నందమూరి తారక రామారావు ఇప్పుడు హీరోగా టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు.

ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులందరితో మంచి అనుబందం ఉన్న దర్శకుడు వైవీఎస్ చౌదరి ఈ మరో జూ.ఎన్టీఆర్‌-2ని సినీ పరిశ్రమకి, ప్రేక్షకులకి హీరోగా పరిచయం చేయబోతున్నారు. అతనికి జోడీగా కూచిపూడి నర్తకి, నటి వీణా రావు చేయబోతున్నారు.

Also Read – ఈ విషయంలో జగన్‌ని నిలదీస్తే… టిడిపికే ఇబ్బంది!

న్యూ టాలెంట్ రోర్స్@ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్‌: 1గా యలమంచిలి గీత నిర్మించబోతున్న ఈ సినిమాకు సంగీతం ఎంఎం కీరవాణి, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర అందించబోతున్నారు. జూ.ఎన్టీఆర్‌-2ని పరిచయం చేస్తూ ఓ పోస్టర్‌ కూడా విడుదల చేశారు.

ఇప్పుడు నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞ, జూ.ఎన్టీఆర్‌-2 కలిపి ఐదుగురు హీరోలు సినీ పరిశ్రమలో ఉన్నట్లవుతుంది.

Also Read – పుష్ప పై క్రెజే కాదు రూమర్లు తగ్గట్లా..!

జూ.ఎన్టీఆర్‌-2కి ముందుగా జూ.ఎన్టీఆర్‌ అభినందనలు తెలియజేస్తూ, సినీ పరిశ్రమలో బాగా రాణించాలని ట్వీట్‌ చేశారు.

సినీ పరిశ్రమలో వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చిన పెద్ద హీరోల మద్యనే ఎంతో కొంత పోటీ ఉంటుంది. ఒకే కుటుంబం నుంచి వచ్చిన హీరోల మద్య కూడా పోటీ తప్పక ఉంటుంది. ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి వేసిన బలమైన పునాదిపై అనేక మంది మెగా హీరోలు సినీ పరిశ్రమలోకి వచ్చి నిలదొక్కుకున్నారు.

Also Read – భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తుందేవరు..?

మెగా ఫ్యామిలీలో హీరోలు పెరుగుతున్నకొద్దీ వారిలో వారికి పోటీ అనివార్యం అవుతోంది. ముఖ్యంగా కొణిదెల హీరోలకు, అల్లు వారసుడు అల్లు అర్జున్‌కి మద్య పోటీ నెలకొని ఉంది. రాజకీయాల ప్రభావం కూడా వారి మద్య కాస్త దూరం పెంచిందని చెప్పవచ్చు.

నందమూరి కుటుంబంలో ఇంతవరకు బాలకృష్ణ సినిమాలు, అభిమానులు లెక్క వేరేగా ఉంటోంది. అదేవిదంగా జూ.ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌ల సినిమాలు, అభిమానులు లెక్కలు వేరేగా ఉంటున్నాయి.




కానీ ఇప్పుడు నందమూరి బ్యాచ్‌లో కొత్తగా మోక్షజ్ఞ, జూ.ఎన్టీఆర్‌-2 ఇద్దరు హీరోలు చేరుతున్నారు. వీరిద్దరూ కూడా నిలద్రొక్కుకునే క్రమంలో ఇప్పుడు వీరందరి మద్య కూడా మెగా-అల్లు మద్య నెలకొన్న పోటీ వంటిది ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే అది సినిమాలకు మాత్రమే పరిమితమైతే అందరికీ సంతోషం.