నానికి ధైర్యం చాల్లేదా?

Nani denies rumours as movie with Srikanth Addala- (2)జెర్సీ చిత్రంతో ఫామ్ లోకి వచ్చిన నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో గ్యాంగ్ లీడ‌ర్ చిత్రం షూటింగులో బిజీగా ఉన్నారు. అయితే ఆయన మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం వంటి డిజాస్టర్ సినిమా తెర‌కెక్కించిన శ్రీకాంత్ అడ్డాలతో ఒక సినిమా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కూచిపూడి వారి వీధి అనే టైటిల్ తో ఈ సినిమాని తెర‌కెక్కించాల‌ని వారు భావిస్తున్న‌ట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కించనున్నారని అన్నారు.

అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో ఉండే ఈ సినిమా శ‌ర్వానంద్ కూడా చిత్రంలో కీల‌క పాత్ర పోషించ‌నున్న‌ట్టు వదంతులు వ్యాపించాయి. దీనిపై మొత్తానికి పెదవి విప్పారు నాని. ఈ విషయంగా వస్తున్న వార్తలన్నీ వదంతులే అని, అటువంటి ప్రొపోజల్ ఏమీ లేదని నాని ట్విట్టర్ లో కంఫర్మ్ చేశారు. అయితే మనకు ఉన్న సమాచారం నానికి భలే భలే మగాడివోయ్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన గీత ఆర్ట్స్ సంస్థ శ్రీకాంత్ ను నాని వద్దకు పంపిందట.

ADVERTISEMENT

పెద్ద సంస్థ పైగా తనకు పెద్ద హిట్ ఇచ్చిన సంస్థ కావడంతో తప్పక స్క్రిప్టు విన్న నానికి అది పర్లేదు అనిపించినా అడ్డాలతో పని చెయ్యడానికి ధైర్యం చాల్లేదట. దీనితో మొహమాటం గానే అల్లు అరవింద్ కు నో చెప్పేశారట. దీనితో అడ్డాల పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. గ్యాంగ్ లీడ‌ర్ కాకుండా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు నటిస్తున్న వీ అనే చిత్రంలో నాని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆయన నెగటివ్ షేడ్ క్యారెక్టర్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories