‘జెంటిల్మెన్’ సినిమాలో నానిని నటించవద్దన్నారట!

Nani ignored everyone in the industryతెలుగు సినీ పరిశ్రమలో యువ కథానాయకుడు ‘నాచురల్ స్టార్’ నానిది ప్రత్యేకమైన శైలి. కథాకథనాలను నమ్ముకుని సినిమాలు చేసే నాని ప్రతి సినిమాలో వైవిధ్యం కోసం పరితపిస్తుంటాడు. ఈ క్రమంలో పలు వైఫల్యాలు చూసినప్పటికీ, ఇదే అతనిని ఇతర కథానాయకుల నుంచి వేరు చేసింది. ‘ఎవడే సుబ్రమణ్యం,’ ‘భలేభలే మగాడివోయ్,’ ‘కృష్ణ గాడి వీరి ప్రేమ గాథ’ వంటి వరుస హిట్లతో మంచి జోరుమీదున్న నాని, తన స్నేహితులు కొంత మంది భారీ బడ్జెట్ సినిమాల్లో నటించాలని ఒత్తిడి తెచ్చారని తాజాగా విడుదల కాబోతున్న ‘జెంటిల్మెన్’ చిత్ర ప్రమోషన్ లో భాగంగా చెప్పుకొచ్చారు.

ఇంకా ప్రయోగాలెందుకు… ఇమేజ్ బేస్డ్ సినిమాలు చేసి మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని వారంతా సూచించారని… అందుకు తగ్గట్టే పేరున్న బ్యానర్ల ఆఫర్లు కూడా తీసుకువచ్చారని నాని చెప్పాడు. అయితే తాను మాత్రం నమ్మిన కథతోనే చేస్తానని చెప్పానని తెలిపాడు. ‘జెంటిల్మెన్’ సినిమాలో నటించవద్దని వారంతా చెప్పినప్పటికీ ధైర్యంగా నటించానని అన్నాడు. వారు చెప్పినట్టు ఈ సినిమా సక్సెస్ కాకపోతే, నమ్మిన సినిమాలో నటించాననే సంతోషం తనకు మిగులుతుందని నాని అభిప్రాయపడ్డాడు. నమ్మని కథతో సినిమా చేసి, సంతృప్తి చెందలేనని నాని స్పష్టం చేశాడు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories