మెగా హీరోతో తలపడనున్న నాని?

Nani-Gang-Leader- clash with chiranjeevi Sye Raa Narasimha Reddy-యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సాహూ చిత్రం ఆగష్టు 15న విడుదల కావాల్సి ఉండగా సినిమా ఆ నెల 30కు పోస్టుపోన్ అయ్యింది. దీనితో మిగతా సినిమాలు ఇబ్బంది పడుతున్నాయి. నాని గ్యాంగ్ లీడర్ సినిమా 30న విడుదల కావాల్సి ఉండగా ఇప్పుడు ఆ సినిమాకు డేట్ లేకుండా పోయింది. సూర్య బందోబస్త్ సినిమా సెప్టెంబర్ 20న విడుదల అవుతుందని ప్రకటించారు. దీనితో డేట్ల సమస్య మరింత జటిలం అయ్యింది. దీని వల్ల ఇప్పుడు గ్యాంగ్ లీడర్, వాల్మీకి సినిమాలు క్లాష్ అయ్యే అవకాశం ఉంది.

వాల్మీకి టీం ఇప్పటికే సెప్టెంబర్ 13న తమ సినిమా విడుదల అవుతుందని ప్రకటించింది. గ్యాంగ్ లీడర్ టీం ఇప్పటిదాకా తమ రిలీజ్ ప్లాన్ ప్రకటించలేదు. అయితే ఇప్పుడు రెండు సినిమాలు సెప్టెంబర్ 12న విడుదల కావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే నిజమైతే క్లాష్ అవ్వాల్సి ఉంటుంది రెండు సినిమాలు. దానితో ఇరు సినిమాల ఓపెనింగ్స్ కొంత మేర తగ్గవచ్చు. అయితే తమ తమ సినిమాలపై రెండు టీంలకు మంచి నమ్మకం ఉండటంతో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

ADVERTISEMENT

ఇద్దరు హీరోలు హిట్లలోనే ఉండడంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. గ్యాంగ్ లీడర్ ఐదుగురు ఆడవారి గ్యాంగ్ తో ముందుకు సాగే ఒక క్రైమ్ కామెడీ. కామెడీ బాగా వర్కు అవుట్ అయ్యిందని సమాచారం. ఇక వాల్మీకి విషయానికి వస్తే తమిళ సూపర్‌హిట్‌ మూవీ ‘జిగర్తాండ’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ తేజ్ ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇదే అతని కేరీర్ లో మొదటి సారి అటువంటి రోల్ చెయ్యడం.

ADVERTISEMENT
Latest Stories