నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ టీజర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘నా పేరు పెన్సిల్. ఫేమస్ రివెంజ్ రైటర్’ అంటూ నాని చెబుతున్న డైలాగ్‌తో టీజర్ మొదలైంది. ఒంటరిగా ఉంటున్న నాని వద్దకు ఓ చిన్నారితో కలిసి నలుగురు ఆడవాళ్లు వస్తారు. వారంతా నాని సాయంతో తమ పగ తీర్చుకుంటూ ఉంటారు. టీజర్ లోని కథ బట్టి, పాత్రల బట్టి, నాని టైమింగ్ బట్టి సినిమాలో కామెడీ గట్టిగానే వర్క్ అవుట్ అయ్యేలా ఉంది.
సినిమాలో రివెంజ్ కోణం ఎలా చొప్పించారు అనేది చూడాలి. ట్రైలర్ లో దాని మీద ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంది. టీజర్ వరకు బానే ఉందనే చెప్పుకోవాలి. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుందని గతంలో నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడు అదే రోజున ప్రభాస్ సాహో విడుదల అవుతుంది. అయితే తమ సినిమా వాయిదా పడింది అని మాత్రం వారు ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటనా చెయ్యలేదు.
నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఆర్‌ఎక్స్ 100 ఫేం కార్తికేయ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు నటిస్తున్నారు నాని హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి(సీవీఎం) నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు.



