పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదండి… వదిలేయండి..!

Gentleman, Nani, Pawan Kalyan Fan, Gentleman Movie, Nani Gentleman, Gentleman Collections, Gentleman review, Gentleman US First day collections, Gentleman release date, Indra‘కృష్ణగాడివీరప్రేమగాధ’ సినిమాలో హీరో బాలకృష్ణ అభిమానిగా నటించి బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకున్న ‘నాచురల్ స్టార్’ నాని, త్వరలో పవన్ కళ్యాణ్ అభిమానిగా మరో చిత్రంలో కనిపించబోతున్నారని వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే తను నటించిన తాజా సినిమా ‘జెంటిల్మెన్’ మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న నేపధ్యంలో… తాజాగా ఇచ్చిన ప్రమోషన్ ఇంటర్వ్యూలో ‘పవన్ కళ్యాణ్ అభిమాని’ అన్న వార్తపై స్పష్టత ఇచ్చారు.

ఇది ఎక్కడ నుండి పుట్టుకొచ్చిందో తనకు తెలియదని, ఎవరూ పుట్టించారో గానీ, అలాంటిదేమీ లేదని పవన్ ఫ్యాన్స్ కు స్పష్టత ఇచ్చారు. తన తదుపరి చిత్రంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రలో కనిపించబోతున్నానని నాని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం యాక్టర్ గా ఉన్న తానూ, ఎప్పుడోకప్పుడు డైరెక్టర్ అవతారం ఎత్తుతానని, అయితే అది ఇప్పట్లో మాత్రం కాదని అన్నారు.

ADVERTISEMENT

తన రెమ్యునరేషన్ పై స్పందించిన నాని, కాలక్రమేణా వచ్చే మార్పులను బట్టి, అలాగే సక్సెస్ గ్రాఫ్ బట్టి సినిమా ఇండస్ట్రీలో పారితోషికాలు మారుతుంటాయని, అంతే తప్ప వేరేగా ఉండదని తెలివైన సమాధానంతో కన్విన్స్ చేసాడు ఈ నాచురల్ స్టార్. ‘జెంటిల్మెన్’ అనే సినిమాకు జోనర్ పెద్ద హైలైట్ అవుతుందని, తన పాత్ర మొదటి 15 నిముషాలలోనే రివీల్ అయిపోయినప్పటికీ, నెక్స్ట్ సీన్ ఏమవుతుందో అనే విధంగా దర్శకుడు ఇంద్రగంటి బాగా తెరకెక్కించారని చెప్పారు సక్సెస్ ఫుల్ హీరో.

ADVERTISEMENT
Latest Stories