నాని అందరినీ ఓ ‘రౌండ్’ వేసేసాడుగా..!

nani speech in Supreme Audio launch‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ సినిమాతో ‘నాచురల్ స్టార్’గా అవతరించిన నాని మంచి మాటకారి కూడా. ఈ విషయం పలు ఆడియో వేడుకలపై ఇప్పటికే స్పష్టం కాగా, తాజాగా జరిగిన “సుప్రీం” ఆడియో వేదికపై మరోసారి నిరూపించుకున్నారు. ఈ సినిమా యూనిట్ దగ్గర నుండి, వేడుకకు యాంకర్ గా విధులు నిర్వహిస్తున్న సుమ మరియు అతిధులుగా విచ్చేసిన వరుణ్ తేజ్ వంటి ఇతర హీరోల వరకు అందరినీ తన మాటలతో ఓ ‘రౌండ్’ వేసేసాడు నాని.

ADVERTISEMENT

‘సుప్రీం’ దర్శకుడు అనిల్ రావిపూడి గురించి మాట్లాడుతూ… ‘అలా మొదలైంది’ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే తాగుబోతు రమేష్ కామెడీ ట్రాక్ ను రాసింది అనిల్ రావిపూడి అని ఆ దర్శకుడి ప్రతిభను కొనియాడాడు. తన కెరీర్ మొదలైన దగ్గర్నుంచి దిల్ రాజు గారితో ఓ సినిమా చేద్దామని భావించానని, కానీ ఇప్పటికి కుదిరిందని, త్వరలోనే దిల్ రాజుతో ఓ సినిమా చేస్తున్నానని నాని ప్రకటించాడు.

‘సుప్రీం’ ఆడియో వేడుక నిర్వహిస్తున్న యాంకర్ సుమ గురించి ప్రస్తావిస్తూ… ‘తాను సుమకు మంచి అభిమానిని, సుమ వేసే పంచ్ లను చూసి, ఇన్ని పంచ్ లు తన సినిమాలో వేయగలనో లేదో అన్న టెన్షన్ లో దర్శకుడు ఉన్నాడని’ నాని చమత్కరించాడు. ‘సుప్రీం’ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ను ఈ మధ్యే టీవీలో చూశానని, అప్పుడు వైట్ డ్రెస్ లో అచ్చం చిరంజీవిలా కనిపించాడని, చిరంజీవి గారిలా కనిపించడం కాదు, ఆయనంత ఎత్తుకు ఎదగాలని నాని తన ఆకాంక్షను వెలిబుచ్చారు.

బ్లాక్ మ్యాచింగ్ డ్రెస్ లు వేసుకొచ్చిన వరుణ్ తేజ్, నేను హీరో గారికి బౌన్సర్లలా ఉన్నామని, అయితే వరుణ్ సరిగ్గా బౌన్సర్ లా ఉంటే… తాను మాత్రం వీక్ బౌన్సర్ లా ఉన్నానని చలోక్తులు సంధించాడు. ఇలా అందరినీ మాటలతో మాయ చేసిన నాని వ్యాఖ్యలు హీరోయిన్ రాశి ఖన్నాపై కూడా పడ్డాయి. ఈ ఆడియో వేడుకలో రెండు సార్లు విజిల్ వేయాలని అనిపించిందని… మొదటిది చిరంజీవి ‘అందం హిందోళం’ రీమిక్స్ పాట వచ్చినప్పుడైతే… రెండో విజిల్ రాశీ ఖన్నా ‘నడుం’ చూపించినప్పుడని చెప్పడంతో రాశి ఖన్నా గట్టిగా నవ్వేసింది.

ADVERTISEMENT
Latest Stories