‘యంగ్ టైగర్’ ఫ్యాన్స్ ను ఊపేస్తున్న పోస్టర్స్!

Nannaku prematho superb designs“నాన్నకు ప్రేమతో” విడుదల కోసం అభిమానులు మరింత ఆతృతతో ఎదురు చూసేలా ఆ సినిమా పోస్టర్స్ దర్శనమిస్తున్నాయి. ఒక్క ఫ్యాన్స్ నే కాదు, సినీ సెలబ్రిటీలు సైతం “నాన్నకు ప్రేమతో” సినీ పోస్టర్స్ కు ఫిదా అవుతున్నారు.

ఎన్టీఆర్ తో “రామయ్య వస్తావయ్యా” చిత్రాన్ని రూపొందిచిన దర్శకుడు హరీష్ శంకర్ ‘బుడ్డోడు’ ఫోటోను షేర్ చేసుకుంటూ, ఇక విడుదల కోసం ఆగలేను అంటూ చెప్తే… ఇక సామాన్య అభిమానుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే సినీ నటి కుష్బూ కూడా “జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాన నటుడని, ఏవో కొన్ని చిత్రాలు తప్ప జూనియర్ నటించిన అన్ని సినిమాలు చూశానని, ఈ సినిమా కూడా చూస్తానని” ట్వీట్ చేసారు.

ADVERTISEMENT

ఇక, ‘లవ్ దెబ్బ…’ పాటలో రకుల్ తో కలిసి యంగ్ టైగర్ ఇచ్చిన స్టిల్ అభిమానులను మరింతగా పిచ్చేక్కిస్తోంది. అలాగే వర్కింగ్ స్టిల్స్ పేరుతో విడుదల చేసిన ఫోటోలు కూడా అభిమానులను విపరీతంగా అలరిస్తున్నాయి. పబ్లిసిటీలో మొన్నటి వరకు వెనకబడిన “నాన్నకు ప్రేమతో” ప్రస్తుతం అన్ని చిత్రాల కంటే ముందు దూసుకుపోతోంది. ఇక, విడుదల తేదీ కోసం అభిమానులు వేచిచూడటమే తరువాయి..!

ADVERTISEMENT
Latest Stories