“నాన్నకు ప్రేమతో” సినిమా టాక్?

nannaku-premato-movie-talkతండ్రీ – కొడుకుల ఎమోషన్ తో “నాన్నకు ప్రేమతో” సినిమాతో ‘యంగ్ టైగర్’ వెండితెరపై ఎంట్రీ ఇచ్చేసాడు. ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూసిన క్షణాలు వచ్చేసాయి. కటౌట్లకు పాలాభిషేకం, ఫ్లెక్సీలకు పూలభిషేకం, ధియేటర్లలో పేపర్లాభిషేకం నడుమ “నాన్నకు ప్రేమతో” సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ‘బ్లాక్ బస్టర్’ టాక్ తప్ప మరొకటి అవసరం లేని ‘యంగ్ టైగర్’కు ఆ కొరతను ఈ సినిమా టాక్ తీర్చిందా? ఎన్నో ఆశలు పెట్టుకున్న “నాన్నకు ప్రేమతో” సినిమాపై టాక్ ఎలా ఉంది?

ఈ సినిమాను వీక్షించిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులైతే ఒకటే మాట చెబుతున్నారు… ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలలో ‘యంగ్ టైగర్’ ఇరగదీసాడని, బొమ్మ ‘బ్లాక్ బస్టర్’ కావడం ఖాయం అంటున్నారు. అయితే ఆశించిన రీతిలో లేదన్న అభిప్రాయంతో సామాన్య ప్రేక్షకుల నుండి ‘యావరేజ్’ టాక్ కూడా వినపడుతోంది. గత సినిమాలో చేసిన తప్పులను సుకుమార్ సరిచేసుకున్నప్పటికీ, ఈ సినిమాకు మూలకధ అయిన తండ్రీ కొడుకుల మధ్య బలమైన ఎమోషన్ లోపించిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సన్నివేశాల రిపిటిషన్ ఆడియన్స్ కు అవరోధంగా మారే అవకాశముందని, హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ సరిగా వర్కౌట్ కాలేదన్న విమర్శలు వస్తున్నాయి.

ADVERTISEMENT

మొత్తంగా చెప్పాలంటే… “నాన్నకు ప్రేమతో” సినిమాలో మిగతా విషయాలు ఎలా ఉన్నా… సెటిల్డ్ ఎన్టీఆర్ అభినయంతో పాటు, సుకుమార్ మ్యాజిక్ స్క్రీన్ ప్లే, దేవిశ్రీ ప్రసాద్ పాటలు, నేపధ్య సంగీతం పై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే ఈ పండగ సమయంలో సినిమాల మధ్య ఉన్న పోటీతత్వం రీత్యా “నాన్నకు ప్రేమతో” ఏ రేంజ్ ను చేరుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. భారీ స్థాయిలో విడుదల కావడంతో తొలిరోజు అబ్బురపరిచే కలెక్షన్స్ ‘యంగ్ టైగర్’ దాసోహం అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories