ప్రకృతి ప్రకోపానికి గురై ఆర్తనాదాలు పెడుతున్న చెన్నై వాసుల కోసం ప్రముఖులంతా ముందుకు కదులుతున్నారు. ఎవరికి తోచినంత సాయాన్ని వారు అందజేస్తూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. దీనిలో భాగంగా ఏపీ సిఎం తనయుడు, టీడీపీ యువనేత లోకేష్ కూడా చెన్నై వాసుల కోసం స్పందిచారు.
“కష్టాల్లో ఉన్న మన పొరుగువారిని ఆదుకోవాల్సిన సమయం ఇదని, అందుకోసం అందరూ నడుంబిగించాలని పిలుపునిచ్చిన లోకేష్, తమ హెరిటేజ్ ఫ్రెష్ సంస్థ వారం పాటు చెన్నై వాసులకు నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తుందని చెప్పారు.
బాధితుల కోసం లక్ష మంచి నీటి బాటిల్స్, పాలు, కూరగాయలు, బిస్కెట్స్ వారం రోజుల పాటు అందిస్తామని చెప్పారు. నిత్యావసర వస్తువులున్న 25వేల బ్యాగ్స్ ను వాహనాల ద్వారా పంపిస్తున్న దృశ్యాలను ఈ సందర్భంగా తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు లోకేష్.
ADVERTISEMENT





