వరుస పరాజయాలతో సతమతం అవుతున్న మోడీ – షా

Narendra Modi - Amit Shahపార్లమెంట్ ఎన్నికలలో సునాయాసంగా గెలిచిన బీజేపీ ఆ తరువాత రాష్ట్రాలలో వరుస పరాజయాలతో సతమతం అవుతుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ఝార్ఖండ్‌, హరియాణా, తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటర్లు షాకిచ్చారు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఝార్ఖండ్‌లో 14 స్థానాలకు 11 చోట్ల బీజేపీ గెలుపొందింది.

అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్జేడీ కూటమి గెలుపొందింది. హరియాణా విషయంలో చావు తప్పి కొన్ను లొట్టబోయినట్టు అయ్యింది. 10కి 10 స్థానాలను కైవసం చేసుకున్న ఆ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి మెజారిటీ స్థానాలు సాధించలేక చివరికి దుష్యంత్‌ చౌతాలా నేతృత్వంలోని జన నాయక్‌ జనతా పార్టీ (జేజేపీ)తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

ADVERTISEMENT

బీజేపీకి ఎంతో కీలకంగా చెప్పబడే మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర (48) లో 23 స్థానాలను గెలుచుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది. దీనికి తోడు శివసేనతో విభేదాల కారణంగా అధికారానికి దూరమైంది. కాంగ్రెస్ చేతిలో దేశంలోనే కీలకంగా చెప్పబడే రాష్ట్రాన్ని పెట్టాల్సి వచ్చింది.

ఇక ఇప్పుడు ఢిల్లీలో కూడా అదే పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికలలో ఏడుకి ఏడూ సీట్లు రాబట్టి ఇప్పుడు 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో సింగల్ డిజిట్ కే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇక తొందరలో జరిగే బీహార్ ఎన్నికలలో ఏం జరగబోతుంది అనేది చూడాల్సి ఉంది. అది కూడా ఓడిపోతే ఆ పార్టీకి రాజకీయంగా ఇబ్బందే.

ADVERTISEMENT
Latest Stories