వాస్తు దోషం వల్లే మోడీ వేవ్ తగ్గిందట

Narendra Modi  ఈ మద్య కాలంలో బిజెపికి ఎదురు దెబ్బలు తగలడం, ప్రధాని మోడీ గ్రాఫ్ కొంత తగ్గడం నేపద్యంలో కొంతమంది ఢిల్లీలో ఇటీవలే నిర్మించిన బీజేపీ కొత్త ఆఫీసు భవనానికి వాస్తు దోషం ఉందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారట. లక్షా డబ్బైవేల చదరపు అడుగుల విస్తీర్ణంలో బారీ ఎత్తున బిజెపి ఆఫీస్ ను నిర్మించుకుంది.

ADVERTISEMENT

మొదటి మూడు సంవత్సరాల పాలనలో మోడీకి వచ్చిన విజయాలను పరిగణలోకి తీసుకుంటే ,ఇటీవలి కాలంలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. కర్నాటకలో అత్యధిక సీట్లు వచ్చినా, అదికారం దక్కకపోవడం, ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికలలో ఓడిపోవడం వంటి వాటితో పార్టీ ఎంతో ఢీలా పడిందట. దీనితో 2019 ఎన్నికల ముందు శ్రేణులు నిరుత్సాహంలో మునిగిపోయాయట.

ఈ నేపధ్యంలో బిజెపి పాత ఆఫీస్ ఉన్న అశోక రోడ్డులోని 11 వ నెంబర్ భవనంలోకి వెళితే బెటర్ అని కొంతమంది నేతలు సూచిస్తున్నారట. కొందరేమో ఎమన్నా వాస్తు మార్పులు చేస్తే మంచిదని చెబుతున్నారట. అయితే అవన్ని వదంతులు అని, పార్టీ కొత్త భవనం నుంచే పనిచేస్తుందని, తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ వారు అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories