హీరో గారి సెటైర్ అదిరింది!

The Guy Confirmed for Himself, Navdeep as Gay!‘జై’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో నవదీప్, ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసినప్పటికీ, తగిన గుర్తింపు లభించలేదు. దీంతో ఇతర హీరోల సినిమాలలో క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ… మరో పక్కన బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నాడు. అలాగే గతంలో హల్చల్ చేసిన డ్రగ్స్ కేసులో కూడా నవదీప్ పేరు ప్రధానంగా వినిపించింది, విచారణను కూడా ఎదుర్కొన్నాడు. సినీ నటుడుగా కాక సొంత వ్యాపారాలు కూడా ఉన్నాయి.

ఇన్ని ఉన్నాయి గానీ, ఎందులోనూ సెటిల్ కాలేదన్న టాక్ నవదీప్ పై ఉన్న నేపధ్యంలో… తాజాగా ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ… నాకంటూ ఓ గమ్యం లేదని బ్లేమ్ చేయవద్దంటూ సెటైర్ వేసారు. ఇంతకీ తాను పోస్ట్ చేసిన ఫోటో ‘ట్రాఫిక్ సిగ్నల్’కు సంబంధించి! ఒకేసారి రెడ్, రెండు గ్రీన్ లైట్స్ వేసి ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ ను పోస్ట్ చేసిన నవదీప్, దానిని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి నెటిజన్లను ఆకట్టుకున్నాడు. ఈ పోస్ట్ కు వీక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది.

ADVERTISEMENT

https://www.instagram.com/p/Bkj07LohWgm/?taken-by=pnavdeep

ADVERTISEMENT
Latest Stories