సిద్ధూ – కేజ్రీవాల్ మధ్య ‘కింగ్ మేకర్’ సీక్రెట్ డీల్?

Navjot Singh Sidhu, Navjot Singh Sidhu Kejriwal Deal, Navjot Sidhu Kejriwal Deal, Navjot Sidhu Kejriwal Political Deal, Navjot Sidhu Kejriwal Friendship అధికారంలో ఉన్న ఎంపీ పదవికి రాజీనామా చేయడం అంటే మామూలు విషయం కాదు. అలా తనే కాకుండా, తన భార్య కౌర్ చేత కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించిన బిజెపి ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారారు. దీని వెనుక ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సిద్ధూ ఆప్ లో చేరుతారని, ఆపై పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆప్ తరఫున రంగంలోకి దిగుతారన్న వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సిద్ధూ – కేజ్రీవాల్ మధ్య కుదిరిన ఓ “సీక్రెట్ డీల్” వివరాలు ఇవేనంటూ జాతీయ మీడియాలో పలు ఆసక్తికర కథనాలు ప్రసారమవుతున్నాయి. పంజాబ్ లో ‘కింగ్’గా ఉండనని, ‘కింగ్ మేకర్’లా మాత్రమే వ్యవహరిస్తానని సిద్ధూ కేజ్రీవాల్ కు స్పష్టం చేసినట్టు… ఇందుకు గానూ ఓ నాలుగు ‘టర్మ్స్ అండ్ కండిషన్స్’ పెట్టినట్టు సమాచారం. అవి ఏంటంటే…

ADVERTISEMENT

పంజాబ్ ఎన్నికల్లో ఆప్ తరఫున సీఎం అభ్యర్థిగా ఉండబోను.
కనీసం ఎన్నికల్లో కూడా పోటీ చేయను.
ఆప్ తరఫున స్వేచ్ఛగా పంజాబ్ అంతా తిరుగుతూ ప్రచారం చేస్తాను.
కనీసం నా భార్య కూడా పోటీ చేయదు సరికదా, పార్టీ పదవి కూడా వద్దు.

ఈ నాలుగు కండిషన్స్ ను కేజ్రీవాల్ కు ముందే సిద్ధూ చెప్పి ఆపై బీజేపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. దీనిపై అటు సిద్ధూ నుంచి గానీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గానీ అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

ADVERTISEMENT
Latest Stories