ట్రైలర్ టాక్ – ఆట సరిగ్గా లేకపోతే నిర్మాతలు ఫీలవ్వాలి!

Nayaki Movie Theatrical Trailer రెండు, మూడు నిముషాలలో చూపించే హార్రర్ సినిమాల ట్రైలర్లు వీక్షించడానికి ఆసక్తికరంగానే ఉంటాయి. అయితే రెండున్నర్ర గంటల సినిమాకు వచ్చే పాటికి ధియేటర్లలో ప్రేక్షకులకు కలిగే ‘భయం’ కన్నా, ధియేటర్ బయట నిర్మాతలకు ఎక్కువగా ‘భయం’ కలుగుతోంది. ఇటీవల కాలంలో విడుదలైన హార్రర్ సినిమాల పరిస్థితి ఇది. అయితే ఇదే భయాన్ని ధియేటర్లో ప్రేక్షకులకు కలిగిస్తే మాత్రం నిర్మాతకు కాసుల పంట ఖాయం.

ADVERTISEMENT

మరి త్రిష ‘నాయకి’ ఏ విభాగంలో చేరుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాలి. అయితే ధియేటిరికల్ ట్రైలర్ మాత్రం రొటీన్ హార్రర్ ఫ్లిక్ ను తలపిస్తోంది. ‘గీతాంజలి’ మాదిరి కామెడీ హార్రర్ నేపధ్యంలో చిత్ర కధ సాగినట్లుగా ట్రైలర్ స్పష్టం చేసింది. ప్రధాన పాత్రలో త్రిష నటించగా, ‘సత్యం’ రాజేష్, సుష్మా, బ్రహ్మానందం ఇతర పాత్రల్లో కనిపించారు. త్రిష తొలిసారిగా హార్రర్ జోన్ లో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

ADVERTISEMENT
Latest Stories