సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంలో డ్రగ్ యాంగిల్‌కు సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ యొక్క స్టేట్మెంట్ ను నమోదు చేసిందని మన పాఠకులకు తెలుసు. సుశాంత్ ఆతిథ్యమిచ్చిన పార్టీలకు హాజరైనట్లు నటి అంగీకరించిందని, కానీ తాను ఎటువంటి మత్తుపదార్థాలు తీసుకోలేదని ఆమె చెప్పినట్టుగా పుకార్లు ఉన్నాయి.
అలాగే ముంబైలోని ఆమె ఇంట్లో ఎన్‌సిబికు డ్రగ్స్ దొరికినట్లు కొన్ని మీడియా కథనాలు ఆరోపించాయి. ఇది ఇలా ఉండగా… డిపార్ట్మెంట్ ఆమె మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకుంది. అందులోని మెస్సేజ్లను డీక్రిప్ట్ చేసే పనిలో ఉన్నట్టు సమాచారం. డ్రగ్స్ పెడ్లర్లకు నిధుల బదిలీ ఏమైనా జరిగిందా అని ఎన్‌సిబి తన బ్యాంక్ రికార్డులను కూడా స్కాన్ చేస్తోందని సమాచారం.
అలాగే ఈ మధ్య ఆమె చేసిన కొత్త ఇన్వెస్ట్మెంట్ల మీద కూడా దృష్టి సారించిందట. ఇదిలా ఉండగా, రాకుల్ ప్రీత్ సింగ్ నిన్న రాత్రి హైదరాబాద్ తిరిగి వచ్చింది. అయితే మీడియాకు చిక్కకుండానే వెళ్ళిపోయింది. క్రిష్ దర్శకత్వం వహించబోయే వైష్ణవ్ తేజ్ తదుపరి చిత్రం షూటింగ్ లో ఆమె పాల్గొననుంది.
నటి యొక్క ఈ సమస్య కారణంగా సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇక ముందైనా ఎటువంటి ఆటంకం కలగకుండా షూటింగ్ ముందుకు కదులుతుందని చిత్రబృందం భావిస్తుంది. మరోవైపు చిత్రం నుండి రకుల్ ని తప్పిస్తారని పుకార్లు వచ్చినా వాటిలో నిజం లేదని వారు కొట్టిపారేస్తున్నారు.




