కొరటాల రిలీజ్ చేసిన ‘ఫస్ట్ లుక్’ టాక్!

Neevevaro-Movie-First-Look-Motion-Poster‘రంగస్థలం’ సినిమాతో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న ఆది పినిశెట్టి సోలోగా రాబోతున్న చిత్రం “నీవెవరో.” అగ్ర దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పిక్చర్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసారు. ఆది, తాప్సీ జంటగా నటించిన ఈ సినిమాలో ‘గురు’ ఫేం రితికా సింగ్ మరో కీలకపాత్ర పోషిస్తోంది.

అచ్చు, ఘిబ్రన్, ప్రసన్ లు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ సంగీతంతో విడుదలైన ఈ మోషన్ పిక్చర్ ఆకట్టుకునే విధంగా ఉంది. సైడ్ యాంగిల్ లో తాప్సీని ప్రజెంట్ చేయగా, ఎగురుతున్న పావురం పక్కనే ఆది పినిశెట్టిని చూపించారు. ప్రముఖ చిత్ర రచయిత కోన వెంకట్ ఈ సినిమాను నిర్మించగా, హరినాథ్ దర్శకత్వం వహించారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories