వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్!

Neha-Dhupia-Marries-Angad-Bediబాలీవుడ్ లో వరుసగా పెళ్లిబాజాలు మోగుతున్నాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని హీరోయిన్ అనుష్క శర్మ పెళ్లాడింది. రెండ్రోజుల క్రితం అనిల్ కపూర్ ముద్దుల తనయ సోనమ్ కపూర్, ఆనంద్ అహూజల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా బాలీవుడ్ జంట నేహా ధూపియా, అంగధ్ బేడీలు పెళ్లి చేసుకున్నారు.

క్రికెట్ లెజెండ్ బిషన్ సింగ్ బేడీ కుమారుడే అంగధ్ బేడీ. తామిద్దరం వివాహబంధంతో ఒక్కటైనట్టు సోషల్ మీడియా ద్వారా కొత్త జంట ప్రకటించింది. ఈ సందర్భంగా నేహా ధూపియా, ఆనంద్ అంగధ్ లు ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయమని నేహ ట్వీట్ చేసింది. తన బెస్ట్ ఫ్రెండ్ ను ఈ రోజు పెళ్లాడానని చెప్పింది.

ADVERTISEMENT

‘నా బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడు భార్య అయింది’ అంటూ అంగధ్ ట్వీట్ చేశాడు. బాలీవుడ్ లో నేహా ధూపియా పలు సినిమాల్లో నటించింది. ‘ఫాల్తు’, ‘ఉంగ్లి అండ్ పింక్’, ‘టైగర్ జిందా హై’ తదితర సినిమాల్లో అంగధ్ నటించాడు. నేహా ధూపియా వయసు 37 ఏళ్లు కాగా… అంగధ్ రెండేళ్లు చిన్నవాడు కావడం విశేషం.

ADVERTISEMENT
Latest Stories