హీరోకు తగ్గట్లే ఉంది టీజర్ కూడా!

Nela Ticket Movie Teaserమాస్ కు కేరాఫ్ అడ్రస్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం “నేల టికెట్టు.” కేవలం మాస్ మహారాజాకు మాత్రమే సూట్ అయ్యే ఈ టైటిల్ తో చిత్ర నిర్మాణ సంస్థ ఫస్ట్ టీజర్ ను విడుదల చేసింది. ‘సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలతో ఫేమస్ అయిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ టీజర్ హీరోకు తగిన విధంగానే ఉంది.

‘చుట్టూ జనం… మధ్యలో మనం… అలా ఉండాలిరా లైఫ్ అంటే…,’ ‘నేల టికెట్టు గాళ్ళతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు’ అన్న రవితేజ మార్క్ రిలీజ్ అయిన ఈ టీజర్ నిండా రవితేజ ‘నేల టికెట్టు’ హావభావాలే నిండి ఉన్నాయి. రవితేజ కెరీర్ నుండి తొలినాళ్ళ నుండి కొనసాగిస్తున్న నటననే ఇందులో కూడా ప్రదర్శించారు తప్ప, కొత్తగా ఏం లేదు.

ADVERTISEMENT

అయితే మాస్ ప్రియులను ఆకట్టుకునేలా జోష్ ఫుల్ రవితేజ కనిపించడం ఫ్యాన్స్ కు పండగే. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటించగా, మరో కీలకపాత్రలో జగపతిబాబు నటించారు. ‘టచ్ చేసి చూడు’ సినిమాతో డీలాపడ్డ రవితేజకు ఈ మాస్ ఎంటర్టైనర్ అయినా జోష్ ని నింపుతుందేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories