ఎన్టీఆర్ ఆశలను చిగురింపచేసిన “నేను.. శైలజ…”

nenu-sailaja-raises-jr-ntr-hopes“నేను.. శైలజ…” చిత్రం ముందు వరకు ఎనర్జిటిక్ స్టార్ రామ్ గత కొన్ని సంవత్సరాలుగా ‘సక్సెస్’ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసారు. అయితే 2016 జనవరి 1వ తేదీ హీరోగా రామ్ ఫేట్ ను మార్చేసింది. ఆ రోజున విడుదలైన “నేను.. శైలజ…” సూపర్ హిట్ సాధించి, రామ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మార్క్ షేర్ ను అందుకుందని, అలాగే 15 కోట్ల గ్రాస్ వసూళ్ళను సాధించిదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఒక్క ఏపీ, తెలంగాణాలలో మాత్రమే కాదు, అటు యుఎస్ మార్కెట్ లోనూ “నేను.. శైలజ…” సినిమా దుమ్ముదులుపుతోందని టాక్. అన్ని అంశాలు కలిసి వస్తే రామ్ కెరీర్ లో 1 మిలియన్ డాలర్స్ అందుకున్న తొలి చిత్రంగా “నేను.. శైలజ…” నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రామ్ కెరీర్ ను ఇంతలా ప్రభావితం చేసిన 2016వ సంవత్సరం తనక్కూడా కలిసి వస్తుందనే ఆశాభావంతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారని కృష్ణనగర్ కబుర్లు. రామ్ మాదిరే గత కొన్ని సంవత్సరాలుగా భారీ హిట్ కోసం జూనియర్ ఎదురు చూస్తున్నారు. ‘ఆల్ టైం ఇండస్ట్రీ హిట్’ మాట ఎలా ఉన్నా… రామ్ మాదిరే తన కెరీర్ బెస్ట్ అందుకునే చిత్రంగా “నాన్నకు ప్రేమతో” నిలబడితే చాలని ‘బుడ్డోడు’ భావిస్తున్నారట. అయితే సినిమాపై ఉన్న అంచనాల రీత్యా “అయితే భారీ హిట్ లేదంటే గత సినిమాల పరిస్థితే” కావచ్చు అన్న మాటలు సినీవర్గాల్లో వినపడుతున్నాయి. ఏదేమైనా రామ్ నటించిన “నేను.. శైలజ…” చిత్రం జూనియర్ ఎన్టీఆర్ మరియు ఆయన అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని అయితే నింపిందని తెలుస్తోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories