అవును మేనల్లుడు పెళ్ళి పీటలు ఎక్కుతుంటే మావయ్య ఇంకా బ్యాచిలర్‌గా కాలక్షేపం చేసేస్తున్నాడు. ఆ మావయ్య మరెవరో కాదు… కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఆయన వయసు 55. మేనల్లుడు అంటే సోదరి ప్రియాంక వాద్రా కుమారుడు రెహాన్ వాద్రా వయసు (25).
అతను తన స్నేహితురాలు అవీవా బేగ్‌తో టీనేజ్ నుంచే ప్రేమలో పడ్డారు. ఇటీవలే వారి వివాహ నిశ్చితార్ధం కూడా జరిగింది. ప్రియాంక, రాబర్ట్ వాద్రా దంపతులు, రెహాన్ వాద్రా ముగ్గురూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు రాజస్థాన్‌లోని రణతంబోర్ వెళ్ళారు. వారితోపాటు అవీవా బేగ్, తల్లితండ్రులు కూడా వెళ్ళారు. అయితే వారి నిశ్చితార్ధం, పెళ్ళి గురించి ఇరు కుటుంబాలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
అవీవా బేగ్ ఆపే జిందాల్ యూనివర్సిటీలో జర్నలిజంలో డిగ్రీ చేశారు. గత ఏడేళ్ళుగా అంటే ఇద్దరూ ఆమె తల్లి తండ్రులు ఢిల్లీలోనే ఉన్నారు. ఆమె తండ్రి ప్రముఖ బిజినెస్ మ్యాన్ అని సమాచారం. అవీవా బేగ్‌కి వైల్డ్ ఫోటోగ్రఫీ, ట్రావెలింగ్ హాబీలు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.
తన కళ్ళ ముందు పుట్టి పెరిగిన మేనల్లుడు రెహాన్ వాద్రా కూడా పెళ్ళికి సిద్దమైపోయినా రాహుల్ గాంధీ మాత్రం ఆ ఊసే లేకుండా రాజకీయాలతో కాలక్షేపం చేసేస్తున్నారు. ఎప్పటికైనా ప్రధాన మంత్రి కావాలని రాహుల్ గాంధీ అనుకుంటున్నారు. కానీ ‘బ్యాచిలర్ ప్రధాని’ మోడీ ఇప్పట్లో ఆ కుర్చీ దిగేలా లేరు. కనుక ప్రధాని కావాలనే రాహుల్ గాంధీ పగటికల గానే మిగిలిపోతే ఆయన జీవితం కూడా అడవి కాచిన వెన్నెల గానే మిగిలిపోతుందేమో?




