భారత్‌లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ నేడు సంచలన ప్రకటన చేసింది. నెట్‌ఫ్లిక్స్ పండగ పేరుతో ఏకంగా 13 సినిమాలు ప్రకటించింది.
వాటిలో ఇటీవల విడుదలైన సినిమాలు మొదలు ఇక ముందు విడుదల కాబోయే సినిమాలు ఉన్నాయి. వాటిలో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, రామ్ చరణ్ ‘పెద్ది’, శర్వానంద్ ‘బైకర్’, వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’, నాని ‘ది ప్యారడైజ్’, రోషన్ ‘ఛాంపియన్’, విశ్వక్ సేన్ ‘ఫంకీ’, విజయ్ దేవరకొండ ‘వీడీ14’, సల్మాన్ దుల్కర్ ‘ఆకాశంలో ఒక తార’, ‘రూమ్ నం:418’, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ వగైరా సినిమాలున్నాయి.
ఇంకా షూటింగ్ మొదలుపెట్టని సినిమాలు మొదలు షూటింగ్ దశలో ఉన్న సినిమాల వరకు నెట్‌ఫ్లిక్స్ ఒకేసారి ఇన్ని సినిమాలు ప్రకటించడం చాలా విశేషమే.
ఓటీటీ సంస్థల మద్య పోటీ నానాటికీ తీవ్రం అవుతుండటంతో నెట్‌ఫ్లిక్స్ సంస్థ చాలా తెలివిగా పెద్ద సినిమాలన్నీ తమ ఓటీటీలోనే వస్తాయని ప్రకటించింది. ఇది మంచి వ్యాపార వ్యూహమే అని భావించవచ్చు. దీని వలన ఓటీటీల మద్య ఊగిసలాడుతున్న మద్య తరగతి ప్రజలందరూ మరో ఆలోచన చేయకుండా నెట్‌ఫ్లిక్స్‌కి వచ్చేస్తారు.
పైగా అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి కొన్ని ఓటీటీ సంస్థలు భారీగా ఫీజు వసూలు చేసి మద్యలో వాణిజ్య ప్రకటనలతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. కనుక ‘నెట్‌ఫ్లిక్స్ పండగ’ పేరుతో ఈ సినిమాల జాబితా చూసి చాలా మంది నెట్‌ఫ్లిక్స్‌కి జంప్ అయిపోవచ్చు.






