కొత్త 500 రూపాయలు నోట్లు వచ్చేసాయ్!

new-500-rupees-notesదేశమంతా ప్రస్తుతం ఒక్కటే చర్చ. ప్రస్తుతం వాడుకలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను ఏం చేయాలి అని? కొత్త నోట్లు ఎప్పుడు వస్తాయి? ఇలా రకరకాలుగా ప్రశ్నల మీద ప్రశ్నలు… మీడియా వర్గాలు ఎంత సమాచారం ప్రసారం చేస్తున్నప్పటికీ… ఇంకా ఏదో సందేహం. ఇలా జవాబులు లేని ప్రశ్నలు ప్రజల మదిలో కోకొల్లలు. అయితే ప్రస్తుత పరిస్థితి సర్దుమనగడానికి మరొక నాలుగైదు రోజుల సమయం పట్టవచ్చన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.

రద్దు చేసిన పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లు ఎప్పుడు వస్తాయి? ఎలా ఉంటాయి? అన్న ప్రశ్నలకు ఆర్బీఐ కొన్ని సమాధానాలు ఇచ్చింది. కొత్త 500, 2000 నోట్లను అధికారికంగా నవంబర్ 10వ తేదీ నుండి అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రస్తుతం ముద్రణ 24X7 కొనసాగుతోందని, ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు తప్పవని, అందుకే విత్ డ్రాల మీద నిబంధనలు పెట్టామని, క్రమం వారీగా ఆ మొత్తాన్ని పెంచుతామని అధికారులు వెల్లడించారు. అయితే ఆర్బీఐ అధికారులు చెప్తున్న కొత్త నోట్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్నాయి.

ADVERTISEMENT

వయలెట్ రంగుతో కూడిన 2000 రూపాయల నోట్లు ఇప్పటికే హల్చల్ చేయగా, తాజాగా 500 రూపాయల నోట్ కు సంబంధించిన ఫోటోలు కూడా హల్చల్ చేస్తున్నాయి. లైట్ పచ్చ కలర్ లో ఉండే 500 రూపాయల నోట్లు బాగానే ఉన్నాయి గానీ, రెండు వేల రూపాయల నోట్లు మాత్రం కలర్ పేపర్ మాదిరి ఉన్నాయంటూ విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. మొత్తానికి ఒక్క దెబ్బతో దేశం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నారు మోడీ.

ADVERTISEMENT
Latest Stories