పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో కొత్త మార్పులు… వివేక్ పరిధి తగ్గింపు?

Vishwa Prasad Vivek Kuchibotlaపీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇండస్ట్రీ కి వచ్చి ఐదేళ్లు కూడా కాకముందే పాతిక సినిమాలు చేసేశారు. వాళ్ళ స్పీడ్ కి ఇండస్ట్రీనే షాక్ అయ్యింది. ఫాస్టెస్ట్ 100 సినిమాలు చేస్తాం అని పీఎంఎఫ్ అధినేత విశ్వప్రసాద్ అంటే కొంత మంది సీన్ లేదని అంటారు, కొంత మంది ఆ ఫాస్ట్ వల్లే ప్లాపులు వచ్చి పడుతున్నాయి అంటారు.

అయితే విశ్వప్రసాద్ మాత్రం కాన్ఫిడెంట్ గా ఇండస్ట్రీ ని షేక్ చేస్తాం అంటారు.

ADVERTISEMENT

ఇకపోతే పాతిక సినిమాల్లో ప్లాపులే ఎక్కువ అనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. మొహమాటాలకు పోవడం, వేరే చోట్ల వదిలేసిన ప్రాజెక్టులు టేక్ అప్ చెయ్యడం, ప్రొడక్షన్ కంట్రోల్ లేకపోవడం వంటి అనేక కారణాలు పీఎంఎఫ్ ని ఇబ్బంది పెడుతున్నాయి అని ఇండస్ట్రీలో అభిప్రాయం.

విశ్వప్రసాద్ అమెరికాలో ఉంటే ఇక్కడ ఆపరేషన్స్ అంతా చూసేది వివేక్ కూచిబొట్ల.విశ్వప్రసాద్,వివేక్ ది పదిహేనేళ్ల నాటి బంధం. అయితే పీఎంఎఫ్ లో వివేక్ పాత్ర పరిధిలో ఈ మధ్య మార్పులు జరిగాయి అని వినిపిస్తుంది.

ఇప్పుడు ఎక్కువగా విశ్వప్రసాద్ ఇన్వాల్వ్ కావడంతో పాటు తన మనుషులను కొంత మందిని తెచ్చి ప్రాసెస్ ని స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.

ప్రొడక్షన్ లో ఉన్న ప్రోజెక్టుల స్టేటస్ రిపోర్ట్… ఎంత ఖర్చు చేస్తున్నారు? ఎంత షూట్ పూర్తి అయ్యింది? అని డైరెక్టర్ల దగ్గర నుండి స్టేటస్ రిపోర్టులు అడుగుతున్నారట. వెస్టెజ్ ఎక్కడ అవుతుంది అనేది చూసి కొన్ని రిపేర్లు చేస్తున్నారట.

రామబాణం నుండే విశ్వప్రసాద్ కు ఈ స్పృహ మొదలైనా, బ్రో ప్రమోషన్స్ టైమ్ నుండి ఇంప్లిమెంట్ చెయ్యడం స్టార్ట్ చేశారట.

అయితే విశ్వప్రసాద్ కి, వివేక్ కి గ్యాప్ వచ్చిందని ఇండస్ట్రీ లో ప్రచారం మొదలైపోయింది. బ్రో ప్రమోషన్స్ లో విశ్వప్రసాదే ఎక్కువగా కనపడటం, మొన్న ఆ మధ్య నిఖిల్ మీడియాకి ఇచ్చిన చిన్న పార్టీకి కూడా విశ్వప్రసాదే స్వయంగా రావడంతో ఈ ప్రచారానికి దోహదం చేసింది.

అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… ఇది నిజం కాదని అంటున్నారు.

“విశ్వప్రసాద్ గారు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం… కొంత మంది కొత్త వాళ్ళని తీసుకుని రావడం నిజమే. అయితే వివేక్ తో ఎటువంటి ఇష్యూస్ లేవు. సౌమ్యుడు  కావడం, అలాగే ప్రాజెక్టులు ఎక్కువ కావడంతో బ్యాండ్ విడ్త్ ఇబ్బందుల వల్లే మార్పులు చేస్తున్నారు. వివేక్ ఇప్పటికి కూడా కీ రోలే. కాకపోతే ఇది వరకు విశ్వప్రసాద్ గారు 20% ఇన్వాల్వ్ అయితే ఇప్పుడు 50% ఇన్వాల్వ్ అవుతున్నారు,” అని ఆ వర్గాలు చెబుతున్నాయి.

ఏది ఏమైనా ఈ మార్పులు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ని హిట్ల బాట పట్టిస్తాయేమో చూడాలి!

ADVERTISEMENT
Latest Stories