విజయవాడ వరద కష్టాలు ప్రభుత్వానికి అనేక కొత్త పాఠాలు నేర్పించాయి. వరద వస్తే విజయవాడలో ఏయే ప్రాంతాలు నీట మునుగుతాయో తెలిసొచ్చింది. బాధితుల కష్టాలు, అవసరాలు ఏమిటో తెలిసొచ్చాయి.
బుడమేరు ఉదృతంగా ప్రవహిస్తున్నప్పుడు, కుండపోత వర్షం కురుస్తున్నప్పుడు గండ్లు పూడ్చడం ఎంత కష్టమో తెలిసొచ్చింది.
Also Read – అక్కడో వివాదం, ఇక్కడో వివాదం… అసలు కంటే కోసరే ఎక్కువ?
ప్రకాశం బ్యారేజీ రెండు గేట్లు (కౌంటర్ వెయిట్స్) దెబ్బ తింటే ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాలో తెలిసొచ్చింది. వీటన్నిటికీ యుద్ధ ప్రతిపదికన ఏర్పాట్లు ఏవిదంగా చేసుకోవాలో తెలిసొచ్చింది.
వీటన్నిటికీ మించి జగన్, వైసీపి బురద రాజకీయాలను ఎదుర్కోవడం అతి పెద్ద సమస్య అని అర్దమైంది. కనుక విజయవాడ వరదలు ప్రభుత్వానికి చాలా పాఠాలు నేర్పాయనే భావించవచ్చు.
Also Read – ఒక్కటంటే ఒక్కటే..!
అయితే ఈ సమస్యలు శాశ్వితం కావు… బహుశః వారం పదిరోజుల తర్వాత ప్రజలు, ప్రభుత్వం అందరూ మరిచిపోవచ్చు.
కానీ ప్రజలు మరిచిపోయినా ప్రభుత్వం మరిచికుండా ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా శాస్విత పరిష్కారాలు ఆలోచించి అమలుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే ఇటువంటి సమస్యలు అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి కూడా చాలా భారంగా, ఇబ్బందికరంగా మారుతుంటాయి.
Also Read – తిరుమల పవిత్రతకే తొలి ప్రాధాన్యం… అవసరమే!
బుడమేరు చేసిన నష్టాన్ని కళ్ళారా చూసిన మంత్రి నారాయణ దానికీ ‘రీటెయినింగ్ వాల్’ నిర్మించే ప్రతిపాదనని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇది చాలా మంచి ఆలోచన.
కృష్ణానదికి రీటెయినింగ్ వాల్ నిర్మించడం వలననే ఊహించని స్థాయిలో ప్రవాహం వచ్చినప్పటికీ దాని వలన విజయవాడ నగరం నష్టపోకుండా తప్పించుకోగలిగింది. అదేవిదంగా బుడమేరు ముంపు ప్రాంతాల వద్ద రీటెయినింగ్ వాల్ నిర్మిస్తే భవిష్యత్‌లో మళ్ళీ ముంపు సమస్య ఏర్పడదు.
రీటెయినింగ్ వాల్ నిర్మాణంతో పాటు బుడమేరు డైవర్షన్ ప్రాజెక్టులో దశాబ్ధాల క్రితం ప్రతిపాదించిన గణపవరం-అనంతవరం మద్య రిజర్వాయర్ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తే బాగుంటుంది. నిర్మించగలిగితే కృష్ణాజిల్లాకు పీడకలగా మారుతున్న బుడమేరు వరప్రదాయినిగా మారుతుంది. అలాగే బుడమేరు ఆక్రమణలను తొలగించి, కాలువల పూడిక తీత పనులను కూడా ప్రభుత్వం పూర్తిచేయాల్సి ఉంది.
మంత్రులు నిమ్మల రామానాయుడు, నారా లోకేష్, మాజీ మంత్రి దేవినేని ఉమా వంటివారికి ఈ సమస్యలన్నిటిపై పూర్తి అవగాహన ఉంది కనుక వారితో ఓ కమిటీ ఏర్పాటు చేసి ఈ పనులన్నీ పూర్తి చేయించగలిగితే బాగుంటుంది.
ఇక తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన విషయం వైసీపి, జగన్ బురద రాజకీయాలు. వీటికీ టిడిపి కూటమి ప్రభుత్వం సముచితంగా ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.