ట్రైలర్ టాక్ – అబ్బాయిలు… అమ్మాయిలు… ప్రేమ… సెక్స్..!

Next Enti movie Trailer Talkటాలీవుడ్ కు సంబంధించినంత వరకు ప్రేమకధ అంటే… ఒక జంట… వారి మధ్య ప్రేమ… అందుకు విభేదించే పెద్దలు… అంతే..! కానీ బాలీవుడ్ లో అయితే లవ్ స్టోరీ అంటే వీటన్నింటి కంటే ఎక్కువగా బోల్డ్ సీన్స్… లిప్ లాక్స్… అడల్ట్ డైలాగ్స్..! ఈ రెండింటిని కలిపి కొడితే ఎలా ఉంటుందో రుచిచూపించడానికి బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లి “నెక్స్ట్ ఏంటి?”ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లుగా కనపడుతోంది.

ADVERTISEMENT

[m9ad]

అబ్బాయిలు… అమ్మాయిలు… ప్రేమ… సెక్స్… ఈ నాలుగింటి మధ్య “నెక్స్ట్ ఏంటి” ట్రైలర్ చక్కర్లు కొట్టింది. అబ్బాయిలుగా సందీప్ కిషన్, నవదీప్ లు కనిపించగా, అమ్మాయిలుగా తమన్నా, లారిసాలు కనువిందు చేసారు. వీరందరి మధ్య ‘ప్రేమ – సెక్స్’కు సంబంధించిన డైలాగ్స్ ల సమాహారేమే ఈ ట్రైలర్. చూడడానికి, వినడానికి కొత్తగా కనపడుతోన్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories