కమల్ ఖాన్ ను ఓ ఫూల్ అన్న తెలుగు యువ హీరో!

Nikhil fires on Kamaal R Khanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అభ్యంతరకరమైన భాషలో ట్వీట్లు చేసిన బాలీవుడ్ ప్రముఖుడు కమల్ ఖాన్ పై పవన్ అభిమానులు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఆ పవన్ అభిమాన గణంలో ఒకరైన యువ హీరో నిఖిల్ కూడా కమల్ ఖాన్ పై తీవ్రంగా స్పందించారు.

“కమల్ ఖాన్ ఒక ఫూల్ అని, అసభ్యకరమైన పదజాలంతో స్పందించిన కమల్ ఖాన్ కు మన పవర్ ఏంటో చూపిద్దాం…” అంటూ ట్విట్టర్ ద్వారా నిఖిల్ ఇచ్చిన పిలుపుకు నెటిజన్ల నుండి కూడా మంచి స్పందన లభిస్తోంది. ఎలాంటి కారణం లేకుండా పవన్ కళ్యాణ్ పై ట్వీట్లు చేసి, ఒక్క పవన్ నే కాక, దక్షిణాది సినీ ప్రేక్షకులను కూడా అవహేళనగా వ్యాఖ్యానించారు. దీంతో నిఖిల్ స్పందిస్తూ కమల్ ఖాన్ కు బుద్ధి వచ్చేలా స్పందించాలని కోరారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories