హీరో నితిన్ అంత ఎత్తు కావాలనుకుని భంగపడ్డ నిఖిల్ అనే ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కధ ఇది. తన ఎత్తు పెంచుకునేందుకుగాను హైదరాబాద్ లక్డీకాపూల్ లోని గ్లోబల్ ఆసుపత్రి లో శస్త్రచికిత్స చేయించుకున్న నిఖిల్ రెడ్డి సైడ్ ఎఫెక్ట్త్ తో నరకయాతన అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆపరేషన్ సంగతి తల్లిదండ్రులకు చెప్పకుండా పెద్ద తప్పుచేశానని, పొట్టిగా ఉన్నానని స్నేహితులు తనను ఆట పట్టించడంతో తన కాళ్లకు ఆపరేషన్ చేయించుకున్నానని వివరించాడు.
సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో పొడుగు అవ్వాలన్న కసి పెరగడంతోనే ఈ పని చేశానని , కృత్రిమంగా పొడవు కావాలనుకోవడం తప్పిదమేనంటూ తన కధను తెలుపుతూ… ఎత్తు పెరగడం కోసమని చెప్పి ఎవరూ ఇలాంటి ఆపరేషన్ చేయించుకోవద్దని 22 ఏళ్ళ నిఖిల్ సూచించాడు. ఇటీవలే బీటెక్ పూర్తి చేసిన నిఖిల్ రెడ్డి హైటెక్ సిటీ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాడు.
ADVERTISEMENT
ADVERTISEMENT



