పారితోషికం కంటే స్టోరీకే ప్రాముఖ్యత!

nikhil siddharth sankarabharanamయువ హీరో నిఖిల్‌ వరుసగా విజయాలు సాధించుకుంటూ వస్తున్నాడు. అయినా కూడా ఈయన పారితోషికం చిన్న నిర్మాతలకు సైతం అందుబాటులో ఉంది. ఒకటి రెండు సినిమాలు సక్సెస్‌ అయితే కోట్ల పారితోషికం డిమాండ్‌ చేసే టాలీవుడ్‌లో నిఖిల్‌ మాత్రం తన పారితోషికం విషయంలో పట్టు విడుపును ప్రదర్శిస్తున్నాడు. మంచి కథ అయితే పారితోషికంకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వను అంటు, అదే విషయాన్ని ఫాలో అవుతున్నాడు. ఈయన వరుసగా ‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్‌ సూర్య’ వంటి వైవిధ్యభరిత కథాంశాలను ఎంపిక చేసుకుని సక్సెస్‌లను సాధించి తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పర్చుకున్నాడు.

ఈ వారం ఈయన నటించిన ‘శంకరాభరణం’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్‌ నిర్మించాడు. మంచి కథ అవ్వడంతో ఈ సినిమాను తక్కువ పారితోషికంకే నిఖిల్‌ చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. తాజాగా ఈయన ఓకే చేసిన ‘కార్తీకేయ 2’కు సైతం తక్కువ పారితోషికాన్ని అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. కథలకు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తూ పారితోషికాన్ని పెద్దగా పట్టించుకోని నిఖిల్‌ భవిష్యత్తులో మంచి స్టార్‌ అవ్వడం ఖాయం అని విశ్లేషకులు చెబుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories