గురి తప్పిన మిస్సైల్ తో స్పై సాహసం

Nikhil-SPYస్పై క్యాటగిరీ సినిమాలు సరిగా తీయాలే కానీ ట్రెండ్ తో సంబంధం లేకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతూనే ఉంటాయి. అడవి శేష్ గూఢచారి సాధించిన విజయమే దానికి నిదర్శనం. అలాంటిది స్పైనే టైటిల్ గా పెట్టుకుని వచ్చిన నిఖిల్ మీద అంచనాలు రేగడం సహజం. పైగా ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేసుకున్న వైనం ఇవాళ వచ్చిన ఓపెనింగ్స్ కి చాలా హెల్ప్ అయ్యింది.

ముందు కథేంటో చూద్దాం. ఖదీర్(నితిన్ మెహతా)అనే తీవ్రవాది మన దేశం మీద అణుయుద్ధం చేయాలని ప్లాన్ చేసుకుంటాడు. ఇతన్ని పట్టుకునే క్రమంలో సుభాష్(ఆర్యన్ రాజేష్) ప్రాణాలు కోల్పోతాడు. ఆ బాధ్యతను భుజాన వేసుకున్న రా ఏజెంట్ జై(నిఖిల్) ప్రాణాలకు తెగించి దీని వెనుక ఎవరున్నారో బయటికి లాగుతాడు. మరి దేశ స్వాతంత్రం సమయంలో మాయమైన సుభాష్ చంద్ర బోస్ అంతర్ధానానికి దీనికి లింక్ ఏంటనేది ఇక్కడ రివీల్ చేసేది కాదు.

ADVERTISEMENT

వృత్తి పరంగా ఎడిటరైన గ్యారీ డైరెక్షన్ డెబ్యూకి చాలా రిస్కీ పాయింట్ తీసుకున్నాడు. దేశవిదేశాలు మారువేషాల్లో తిరిగే గూఢచారుల సాహసాలకు చరిత్రలో రహస్యంగా మిగిలిపోయిన ఒక అనూహ్య సంఘటనకు ముడి పెట్టే ప్రయత్నం చేయబోయాడు. వింటున్నప్పుడు మంచి ఎగ్జైటింగ్ గా అనిపించే ఈ పాయింట్ ని స్క్రిప్ట్ ని మార్చే క్రమంలో సరైన కసరత్తు చేయకపోవడం స్పై స్థాయిని బాగా తగ్గించేసింది.

సీక్రెట్ ఏజెంట్ల వ్యవహారాలు ఆషామాషీగా ఉండవు. కృష్ణ, జితేంద్ర కాలంలో ఎలా చూపించినా చెల్లింది కానీ ఇప్పటి ఆడియన్స్ చాలా ఎడ్యుకేటెడ్ ఉన్నారు. అలాంటప్పుడు జాగ్రత్తగా సన్నివేశాలు రాసుకోవాలి. కానీ గ్యారీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. కొన్ని సీన్లు ఓవర్ ది టాప్ వెళ్లిపోతాయి. మరికొన్ని గతంలో చూసినట్టు అనిపిస్తాయి.

హిందీ ఇంగ్లీష్ తదితర భాషల్లో లెక్కలేనన్ని స్పై సినిమాలు వెబ్ సిరీస్ లు చూస్తున్న ప్రేక్షకుల ఇంటెలిజెన్స్ ని తక్కువ అంచనా వేస్తే ఇలాంటి స్క్రిప్ట్ లే తెరపైకి వస్తాయి. ఇంట్రో సీన్ నుంచే డల్ గా మొదలయ్యే నెరేషన్ అక్కడక్కడా తప్పించి దాదాపు డ్రైగానే సాగడం అసలు ఉద్దేశాన్ని దెబ్బ తీసింది. సుభాష్ చంద్రబోస్ గురించి తెగ ఊదరగొట్టారు కానీ నిజానికీ స్పైకి ఆ ఉదంతానికి ఎలాంటి కనెక్షన్ లేదు. డైలాగుల్లో కొంత ఎలివేషన్ ఇప్పించారు తప్ప అంతకు మించి మ్యాటర్ లేదు.

నిఖిల్ కష్టపడ్డాడు కానీ జైగా అంతగా సూట్ కాలేదు. దానికి అవసరమైన శరీర దృఢత్వం, కరుకుదనం సరిపోలేదు. హీరోయిన్ల సెలక్షన్ అంతంత మాత్రంగానే ఉంది. చేయడానికి స్కోప్ లేనప్పుడు నిందించి లాభం లేదు. నితిన్ మెహతా, జిస్సుసేన్ గుప్తా, మకరంద్ దేశ్ పాండే, సచిన్ కెడ్కర్ తదితరులతో క్యాస్టింగ్ గ్రాండ్ గా ఉంది కానీ అందరివీ ఎప్పుడో చూసిన పాత్రలనిపించడం ఆడియన్స్ తప్పు కాదు.

ఎక్కడా హై మూమెంట్స్ లేకపోవడం స్పైకున్న మరో మైనస్. బ్యాంగ్ బ్యాంగ్, ఏక్ థా టైగర్, రాజీ, ఫాంటమ్ లాంటి బాలీవుడ్ మూవీస్ చూసైనా వాటి సక్సెస్ వెనుక కారణాలు అర్థం చేసుకుని ఉంటే స్పై ఖచ్చితంగా డీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ అయ్యేది. తెలుగు ఆడియన్స్ ఇలాంటివి చూసి ఉండరనే తప్పుడు అంచనాతో స్పై పూర్తిగా దారి తప్పాడు. మిస్సైల్ ని వదిలారు కానీ అది లక్ష్యం వైపు కాక ఆకాశం లోకి దూసుకుపోయి గురి తప్పింది.

ADVERTISEMENT
Latest Stories