నమ్మారు కదా నాని… ఇలా చేసావేంటి..!

Ninnu Kori’ review‘నా సినిమాలు బాగుంటాయి, చూడండి అని ఎప్పుడూ చెప్పలేదు, కానీ ఈ సారి చెప్తున్నా… నన్ను నమ్మండి… ఈ సినిమా చూసి ఇంటికి వెళ్ళేటపుడు మీతో పాటు తీసుకెళ్ళే సినిమాగా ఖచ్చితంగా నిలుస్తుందని’ అపారమైన విశ్వాసంతో నాని ఇటీవల జరిగిన “నిన్ను కోరి” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రసంగించారు. నిజమే… అసిస్టెంట్ డైరెక్టర్ కం హీరో కాబట్టి కధల విషయంలో నానికి మంచి పట్టు ఉందని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా నమ్మారు.

కట్ చేస్తే… నేడు సినిమా విడుదలైంది. మరి నాని చెప్పిన వ్యాఖ్యలు ఏమయ్యాయి? ప్రేక్షకుల టాక్ ఎలా ఉంది? అంటే… ఇక్కడ నుండి మళ్ళీ అదే ఈవెంట్ కు వెళితే… ‘ఇప్పుడు నేనేం చెప్పినా ఓపెనింగ్స్ కోసమనో లేక బాగా ఎక్కువ చెప్పానని ఫీల్ అవుతారు, అదే సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్తే చాలా తక్కువ చెప్పామని అంటారు, అందుకే “నిన్ను కోరి” విడుదలైన తర్వాత మాట్లాడతా’ అంటూ ముగించేసారు నాని.

ADVERTISEMENT

ప్రస్తుతం సినీ ప్రేక్షకుల అనుభూతి కూడా ఇదే. నాడు నాని తక్కువే చెప్పాడు… ధియేటర్ నుండి ఇంటికి తీసుకువెళ్లడమే కాదు… ప్రేమికులకు, ఏమోషనల్ ప్రేక్షకుల కంట కన్నీరును కూడా తెప్పిస్తోంది ఈ సినిమా. అందుకే నాని… నువ్వు మమ్మల్ని మోసం చేసావ్… అంటూ మీడియా వేదికలుగా తమ అనుభూతిని పంచుకుంటున్నారు సినీ ప్రేక్షకులు. ఇటీవల కాలంలో ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు బాగా కరువైపోవడంతో, “నిన్ను కోరి” ప్రేమికుల ఆకలి మొత్తాన్ని తీర్చేలా టాక్ ను సొంతం చేసుకుంది.

ADVERTISEMENT
Latest Stories