జూనియర్ ఎన్టీఆర్ సరసన నిలిచిన నితిన్!

Nithin 50 Crore Movie, Nithin 50 Crore Film, Nithin Top Movie, Nithin 50 Crore Collections Movie, Nithin 50 Crore Collections Filmఈ ఏడాది పెద్ద సినిమాలు ఇచ్చిన డిజాస్టర్ల తర్వాత సమ్మర్ చివరి చిత్రంగా వచ్చిన “అ…ఆ…” సినిమా ఏకంగా 50 కోట్ల క్లబ్ లో చేరిందని చిత్ర యూనిట్ పోస్టర్లు విడుదల చేసింది. ఇప్పటివరకు అగ్ర హీరోలకు మాత్రమే సాధ్యమనుకున్న 50 కోట్ల క్లబ్ లో నితిన్ అలవోకగా చేరిపోవడం ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ పుణ్యమే అయినా… రికార్డు రికార్డే కదా..! దీంతో 50 కోట్ల క్లబ్ లో చేరిన అగ్ర హీరోల సరసన చేరాడు నితిన్.

ఈ ఏడాది ముందు వరకు జూనియర్ ఎన్టీఆర్, నాగార్జునలకు కూడా 50 కోట్ల క్లబ్ లో సినిమా లేదు. కానీ, సంక్రాంతికి విడుదలైన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా బుడ్డోడుకు మంచి ఉత్సాహాన్ని ఇవ్వగా, అదే సంక్రాంతికి వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ టాలీవుడ్ కే ఊపునిచ్చింది. దీంతో 2016వ సంవత్సరం హీరోలను 50 కోట్ల క్లబ్ లో చేర్చే ఏడాదిగా కీర్తికెక్కుతోంది.

ADVERTISEMENT

ప్రస్తుతం టాలీవుడ్ కు నాలుగు స్తంభాలుగా పరిగణించే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లలో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే ఒకే ఒక్క 50 కోట్ల క్లబ్ సినిమా ఉంది. మిగిలిన ముగ్గురిలో మహేష్ బాబు 3, పవన్ కళ్యాణ్ 2, ప్రభాస్ 2 సినిమాలతో ఉన్నారు. దీంతో ప్రస్తుతం నితిన్ స్థానం జూనియర్ తో సమతూగినట్లయ్యింది. ‘అ…ఆ…’ 50 కోట్ల క్లబ్ లో చేరిన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లు ఆకట్టుకునే విధంగా ఉండడంతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories