చర్లపల్లి జైల్లో టాలీవుడ్ హీరో!

Nithiin movie shooting in Charalapalli jailప్రముఖ టాలీవుడ్ హీరో నితిన్ చర్లపల్లి సెంట్రల్ జైల్లో సందడి చేశాడు. నితిన్ చర్లపల్లి జైలుకు ఎందుకెళ్లాడన్న అనుమానం వచ్చిందా? ఎవరినీ కలిసేందుకు కాదు… ‘అ…ఆ…’ సినిమా తరువాత 14 రీల్స్ బ్యానర్ పై “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ” ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ కోసం నితిన్ చర్లపల్లి జైలుకు వచ్చాడు.

ఈ సందర్భంగా చర్లపల్లి జైలులో సందడి వాతావరణం నెలకొంది. హాస్య నటులు పృధ్వీ, బ్రహ్మాజీ, హీరో నితిన్‌ కాంభినేషన్ లో కొన్ని సీన్లను చిత్రీకరించారు. దీనికి సంబంధించిన సీన్లు చిత్రీకరించాల్సి వస్తే… మరోసారి చర్లపల్లి జైలుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని దర్శకుడు తెలిపాడు. ఈ సినిమాలో నితిన్ పాతబస్తీ యువకుడిగా నటిస్తున్నాడు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories