“ఇష్క్” సినిమా ద్వారా హిట్ అందుకొకముందు, నితిన్ వరుసగా ఎన్ని ఫ్లాప్ లను చవిచూసారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2004లో విడుదలైన ‘సై’ సినిమా తర్వాత సక్సెస్ అన్న మాటకు దూరమైన నితిన్, మళ్ళీ ఎనిమిదేళ్ళ తర్వాత 2012లో ‘ఇష్క్’ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు. అంటే ఒక్క హిట్ కోసం ఎనిమిదేళ్ళు వేచిచూడడం మామూలు విషయం కాదు.
ఈ సమయంలో స్వయంగా దిల్ రాజు వద్దకు వెళ్లి నితిన్, తనకు ఓ సినిమా చేసి పెట్టాలని కోరాడట. ‘దిల్’ సినిమాతోనే నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన రాజు గారిని నితిన్ అడిగినప్పటికీ, తమ కాంబో సెట్ కాలేదని, బహుశా “శ్రీనివాస కళ్యాణం” లాంటి మంచి సినిమా చేయాలని ఉందేమోనని, అందుకే ఇది సెట్ అయ్యిందని ఈ విషయాన్ని స్వయంగా రాజు గారే ఈ సినిమా ఆడియో వేడుక మీద ప్రస్తావించారు.
సక్సెస్ లేకపోతే హీరో మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పడానికి నిదర్శనంగా ఈ ఉదంతాన్ని పేర్కొనవచ్చు. ఈ ఎనిమిదేళ్ళ సమయంలో అవకాశాలకు కొదవ లేకుండా 12 సినిమాలు చేసాడు గానీ, ఒక్క హిట్ రాకపోవడంతో సక్సెస్ ఫుల్ నిర్మాత దరికి హీరో చేరాల్సి వచ్చింది. అందుకే ఇండస్ట్రీలో ‘సక్సెస్’కు అంత ప్రాధాన్యత ఇస్తారు. అయితే ప్రస్తుతం రెండు ఫ్లాప్ లతో ఉన్న నితిన్ కు హిట్ అత్యవసరం.



