మహేష్ పుట్టినరోజున పవన్ ఫ్యాన్ మూవీ!

Srinivasa Kalyanam releasing on 9th Augustప్రిన్స్ మహేష్ బాబు జన్మదినం అయిన ఆగష్టు 9వ తేదీని గ్రాండ్ గా జరుపుకోవడానికి అభిమానులు ఇప్పటినుండే పలు ఛారిటీ కార్యక్రమాలలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇదే రోజున తన మూవీని రిలీజ్ చేసేందుకు పవన్ కళ్యాణ్ అభిమాని అయిన హీరో నితిన్ డేట్ ను ఫిక్స్ చేసారు.

నితిన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం “శ్రీనివాస కళ్యాణం”ను ఆగష్టు 9న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘శతమానం భవతి’ సినిమాతో డైరెక్టర్ గా అవతరించిన వేగేశ్న సతీష్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. నితిన్ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్న నేపధ్యంలో రిలీజ్ డేట్ ను లాక్ చేసారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories