ఈ సినిమాలో ఈ సింగిల్ ఆర్టిస్ట్ మాత్రమే!

Nithya Menen Praanaతెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నిత్యామీనన్ కున్న పాపులారిటీ తెలియనిది కాదు. ఈ నాలుగు భాషల్లోను ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న నిత్యా, అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి నటన పరంగా నూటికి నూరు మార్కులు కొట్టేసింది. అలాంటి నిత్యామీనన్ ఈ మధ్య కాలంలో సినిమాల సంఖ్యను తగ్గించింది. తనకి నచ్చిన కథలకు మాత్రమే ఓకే చెప్పే ఆమె స్వభావమే అందుకు కారణమని చెప్పుకోవచ్చు.

ADVERTISEMENT

ప్రస్తుతం ఆమె ‘ప్రాణ’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా మొత్తం మీద వున్న ఆర్టిస్ట్ ఒక్క నిత్యామీనన్ మాత్రమే. ఆమె చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. అదే ఈ సినిమా ప్రత్యేకత. వీకే ప్రకాశ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా నిత్యామీనన్ ఫస్టు లుక్ ను రిలీజ్ చేశారు. దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా రిలీజ్ చేయబడిన ఈ ఫస్టు లుక్ ఈ సినిమా కాన్సెప్టుపై మరింతగా ఆసక్తిని పెంచుతోంది.

    ADVERTISEMENT
Latest Stories