టాప్ హీరోలకు సాధ్యం కాలేదు… విజయ్ వల్ల అవుతుందా..?

NOTA Brings Unexpected Comparison with Mahesh Babuఒక భారీ హిట్ ఇచ్చిన వెనువెంటనే, మరో డిజాస్టర్ ను అందించడం అగ్ర హీరోల విషయంలో చాలా రొటీన్ గా జరిగే అంశం. ఇదేదో నేటితరం హీరోల నుండి వచ్చినది కాదు. నాడు ఎన్టీఆర్, కృష్ణల హయంలో కూడా ఇదే జరిగింది. ఓ భారీ హిట్ లో తమ అభిమాన హీరోను చూసిన కళ్ళతో, వెనువెంటనే అదే హీరోను మరో క్యారెక్టర్ లో చూడలేకపోవడం చాలా సహజంగా జరిగే ప్రక్రియ. ఇందుకు ఏ టాప్ హీరో కూడా అతీతులు కారు.

[m9ad]

ADVERTISEMENT

మరి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనంగా నిలిచిన “గీత గోవిందం” విజయ్ దేవరకొండ దీనిని సాధ్యం చేసిచూపించగలరా? ‘అర్జున్ రెడ్డి’ ద్వారా బీభత్సకరమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న విజయ్, ‘గీత గోవిందం’ సినిమాతో అన్ని వర్గాల వారికి చేరువయ్యాడు. టాలీవుడ్ లో ఓ సామాన్య హీరో సినిమా 100 కోట్లు వసూలు చేసిందంటే అది సామాన్యమైన విషయం కాదు. అలాంటి దానిని విజయ్ దేవరకొండ సాధ్యం చేసి చూపించాడు.

అదే కోవలో “నోటా” ద్వారా మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుడతాడా? అనేది ఈ అక్టోబర్ లో తెలియనుంది. ‘గీత గోవిందం’ సినిమాలో సింపుల్ అండ్ ఫన్నీ క్యారెక్టర్ ను పండించిన విజయ్, ‘నోటా’లో ఇందుకు విభిన్నంగా సీరియస్ రోల్ ను చేయబోతున్నాడన్న హింట్ ను తాజాగా రిలీజ్ చేసిన స్నీక్ పీక్ చెప్పేసింది. మరి ఇంత తక్కువ గ్యాప్ లో ‘నోటా’ క్యారక్టర్ ను ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏమో… విజయ్ దేవరకొండ విషయంలో మొదట నుండి సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి.

ADVERTISEMENT
Latest Stories