అచ్చి వచ్చిన నెంబర్ల కోసం సినీ సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు ఎంత ఖర్చు అయినా పెడతారన్న సంగతి సామాన్యులకు తెలిసిన విషయమే అయినా… ఒక్క నెంబర్ కోసం వెచ్చించే మొత్తంతో మరోక వాహనం కొనుగోలు చేయవచ్చన్న విషయం సామాన్యులకు కాస్త ఆశ్చర్యకరమే. తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పేరు ఫ్యాన్సీ నెంబర్ జాబితాలో మారుమ్రోగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ వాహనాలకు ఉండే ‘9999’ నెంబర్ కోసం ఏకంగా 10.50 లక్షలు ఖర్చు పెట్టడం విశేషం. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేసిన బీఏండబ్ల్యూ కారుకు ‘9999’ నెంబర్ కోసం వేలం పాటలో పాల్గొని, 10.50 లక్షలకు సదరు నెంబర్ ను సొంతం చేసుకున్నాడు. బరిలో నిలిచిన ముగ్గురిలో జూనియర్ వేసిన మొత్తం అధికం కావడంతో తన 1.21 కోట్ల విలువైన కారుకు బీఎండబ్ల్యూ కారుకు ‘టీఎస్ 09 ఈఎల్ 9999’ నెంబర్ ఖరారయ్యింది.
మొత్తం ఈ వేలం ద్వారా రవాణా శాఖకు 20.31 లక్షలు ఆదాయం రాగా, టీఎస్ 09 ఈఎం 0009 నెంబర్ కు 1.20 లక్షలు, టీఎస్ 09 ఈఎం 0007 నెంబర్ కు 1.65 లక్షలు, టీఎస్ 09 ఈఎం 0006 నెంబర్ కు 1.30 నెంబర్ కు 1.10 లక్షల ధరలు పలికాయి. ఇటీవల కాలంలో ఫ్యాన్సీ నెంబర్లపై మోజు పెచ్చు మీరుతున్న నేపధ్యంలో ప్రభుత్వానికి అది ఆదాయవనరిగా మారింది.



