‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు తేజ, ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు, ఇటీవలే ఎంతో అట్టహాసంగా షూటింగ్ కూడా ప్రారంభించుకున్న ఈ సినిమా నుండి తేజ తప్పుకోవడం విశేషం.
అవును… ‘ఎన్టీఆర్’ బయోపిక్ దర్శకుడిగా తేజ తప్పుకున్నారు. ఇప్పటికే ఎన్నో అడ్డంకులను చవిచూసిన ఈ ప్రాజెక్ట్ కు ఇది మేజర్ దెబ్బగా పరిగణించవచ్చు. దీంతో నెక్స్ట్ డైరెక్టర్ ఎవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకీ మరో దర్శకుడు వస్తారా? లేక ఎన్టీఆర్ బయోపిక్ కు పూర్తిగా బ్రేక్ పడుతుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి.
గతంలో ఎన్టీఆర్ ‘నర్తనశాల’ సినిమా విషయంలో కూడా అనేక అడ్డంకులను తొలగించుకుని, ‘బాలకృష్ణ అండ్ కో’ కొన్నాళ్ళు షూటింగ్ జరిపిన తర్వాత ఆ సినిమా అర్ధంతరంగా ఆగిపోయిన వైనం తెలిసిందే. దీంతో బయోపిక్ విషయంలో అదే అవుతుందా అన్న అనుమానాలు నందమూరి అభిమానుల్లో కూడా నెలకొన్నాయి.



